Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరికి 20 యేళ్ళ సినీ కెరీర్‌ .. ఇంకా తీరని రెండు కోర్కెలు

పూరికి 20 యేళ్ళ సినీ కెరీర్‌ .. ఇంకా తీరని రెండు కోర్కెలు
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (13:40 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని డాషింగ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏప్రిల్ 20వ తేదీతో 20 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల సుధీర్ఘకాలంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల్లో ఒకరిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. 
 
పైగా, మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలు ఆయన సినిమాల్లో చేయాలని ఆరాటపడుతుంటారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమైన 'బద్రి'. హీరో పవన్ కళ్యాణ్. ఈ చిత్రం 2000 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కల్యాణ్  కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా 'బద్రి' నిలిచిపోయింది. 
 
ఆ తర్వాత మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి యువ కథానాయకులతో పలు చిత్రాలు తీసిన పూరి సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున, బాలకృష్ణ, రవితేజలతోనూ సినిమాలు చేశారు.
webdunia
 
అయితే, ఈ 20 ఏళ్లలో 35 సినిమాలను తెరకెక్కించిన పూరి జగన్నాథ్.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లతో మాత్రమే సినిమా చేయలేకపోయారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి పట్టాలెక్కలేదు. 
 
నిజానికి చిరంజీవి రీఎంట్రీ తర్వాత వచ్చిన 150వ చిత్రానికి తొలుత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని అందరూ భావించారు. కానీ, అది వివి వినాయక్‌కు దక్కింది. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఆ లోటును పూరి భర్తీ చేసుకుంటాడేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ కళ్యాణ్‌కు నాకూ సూట్ కాదు : ఎస్ఎస్. రాజమౌళి