Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భోళా శంకర్ కోసం స్విట్జర్లాండ్‌ లో చిరంజీవి, తమన్నా పై పాట చిత్రీకరణ పూర్తి

Chiranjeevi
, మంగళవారం, 30 మే 2023 (18:01 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్  “భోళా శంకర్” మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్‌ తో భారీ కాన్వాస్‌ పై రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మేకర్స్ ఇటీవల స్విట్జర్లాండ్‌ లో చిరంజీవి, తమన్నా భాటియాపై పాట చిత్రీకరణను పూర్తి చేశారు.
 
ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ముందుగా మ్యూజికల్ జర్నీ ప్రారంభిస్తారు. 'భోళా మానియా త్వరలో ప్రారంభమవుతుంది' అని మేకర్స్ అనౌన్స్ చేశారు.  అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ గెటప్‌ లో రెండు చేతులను వెనుక జేబులో పెట్టుకొని చేసిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ ని చూడవచ్చు. ఇక్కడ డిఫరెంట్ గెటప్స్ లో డ్యాన్సర్స్ తో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
 
మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ ని స్కోర్ చేసారు. కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూటింగ్, భారీ సెట్ సాంగ్ పెండింగ్‌ లో ఉన్నాయి. జూన్ నెలాఖరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
 
అనిల్ సుంకర  ఏ కె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్  భావోద్వేగాలు, ఇతర అంశాలు సమపాళ్లలో వుంటాయి.
 
తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా  కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.
 
డడ్లీ డీవోపీ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
భోళా శంకర్  ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.
 
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ , రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్యం చెబుతా : శరత్ కుమార్