పండుగలా సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుక - మహేష్‌బాబు సందేశం
, మంగళవారం, 31 మే 2022 (15:34 IST)
Superstar Krishna, Indiramma, Padmavati, Manjula
సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం మే31. ఈరోజు 80ఏళ్ళు పూర్తిచేసుకున్న కృష్ణగారికి ఆయన కుటుంబీకులు ఓ పండుగలా చేసుకున్నారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, సీనియర్ నరేశ్, రమేష్ కుటుంబీకులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం లంచ్ చేశారు. ఈ సందర్భంగా తమ తల్లిదండ్రులు కృస్ణ, ఇందిరమ్మ దంపతులతో కలిసి భోజనం చేసి ఆశీర్వాదాలు పొందారు.
Superstar Krishna, Adiseshgirirao, Indiramma and others
ఈ సందర్భంగా కుమార్తెలు సోషల్‌మీడియాలో ట్వీట్ చేస్తూ, తమకు ఈరోజు పండుగలా వుంది. మహేష్‌బాబు సర్కారువారిపాట కూడా హిట్ అయిన ఈ ఏడాది నాన్నగారితో ఇలా కలుసుకోవడం చెప్పలేని ఆనందానికి గురయ్యామని పేర్కొన్నారు.
సుధీర్‌బాబు చెప్పలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబసబ్యులంతా గ్రూప్ పొటో దిగారు. మహేష్‌బాబు అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయారు. కానీ ఆయన తన తండ్రికి సందేశాన్ని ఇలా తెలియజేశారు.
తర్వాతి కథనం