Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీకాంత్ "దర్బార్" ఎలా ఉంది? ఫ్యాన్స్ ఏమంటున్నారు?

Advertiesment
రజినీకాంత్
, గురువారం, 9 జనవరి 2020 (09:56 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "దర్బార్". ఏఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వేకువజామునుంచే ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్ టాక్ ప్రకారం ఈ చిత్రం సూపర్‌గా ఉందని, రజినీ హవా ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించిందని అంటున్నారు. 
 
రజినీకాంత్ గతంలో 'కబాలి', 'కాలా', '2.ఓ' చిత్రాలు నటించారు. ఈ మూడు చిత్రాలు కలెక్షన్లపరంగా ఓహో అనిపించినప్పటికీ.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ముఖ్యంగా, ప్రేక్షకులను ఆశించినస్థాయిలో మెప్పించలేక పోయాయి. దీనికి కారణం విడుదలైన తొలి రోజు నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం. 
 
ఈనేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ - రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ "దర్బార్" చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు తగినట్టుగానే ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. ఇందులో నయనతార, నివేదా థామస్‌లతో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ వంటి అనేక మంది ప్రముఖ నటీనటులు నటించారు. 
 
ఈపరిస్థితుల్లో గురువారం ప్రేక్షకుల ముందుకురాగా, ఈ చిత్రం టాక్‌పై ఫ్యాన్స్ స్పందిస్తూ, అభిమానులు, సినీ ప్రేక్షకులు రజనీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్న దర్శకుడు మురుగదాస్, మైండ్ గేమ్‌తో పాటు, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాను రసవత్తరంగా తెరకెక్కించారని చెబుతున్నారు. 
 
ఎంతోకాలం తర్వాత రజనీలోని అసలైన హీరోయిజం బయట పడిందని పలువురు ఫ్యాన్స్ ట్విట్ల రూపంలో తమ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రజనీ ఎంట్రీ నుంచి ప్రతి సీన్ సూపర్బ్‌గా ఉందని చెబుతున్నారు. ఇక రజనీని చూడటానికి రెండు కళ్లూ చాలవని, యాక్షన్, కామెడీ కాక్ టెయిల్ మిక్స్‌గా సినిమా తయారైందని, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అని ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. సో.. రజినీకాంత్ మరోమారు తన సత్తాను చాటాడని చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా మరకలు వేయొద్దంటున్న హీరోయిన్