విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన ఎఫ్..ఐ.ఆ.ర్. సినిమా ఈరోజే అనగా ఫిబ్రవరి 11న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కానీ ఈరోజు కొందరు సినిమాపై వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత భావాలను చిత్ర యూనిట్ ఖండించింది. మా ఎఫ్..ఐ.ఆ.ర్. ఏ మతస్థులను కించపరిచేట్లు తీయలేదు ప్రతి భారతీయుడు గర్వపడేలా తీసిన సినిమా ఇది. కానీ, ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా వుందని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాను ఆపేయడం జరిగింది. కానీ సినిమాను చూసిన ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా లేదని తెలియజేశారు.
అసలు గొడవేంటి!
విష్ణు విశాల్ ఎఫ్.ఐ.ఆర్. మూవీ లో ముస్లిం. అలానే ప్రతినాయకుడు ముస్లిం టెర్రరిస్ట్. దేశంలో అరాచకం సృష్టించడం కోసం టెర్రరిస్టు ప్రయత్నం చేస్తుంటాడు, హీరోలో అతని పోలికలు ఉండటంతో అధికారులు అతన్ని అరెస్ట్ చేసి ఇంటాగేషన్ చేస్తారు ఎం.ఐ.ఎం. పార్టీ యాకత్ పురా శాసన సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖద్రీ సైతం ఈ విషయమై తమ అభ్యంతరాలను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు లేఖ ద్వారా తెలియచేశారు. ఎఫ్.ఐ.ఆర్.మూవీ పోస్టర్ పై అరబిక్ భాషలో ఉన్న షహద అనే పదం ఇస్లాం మతానికి చెందిందని, అది ఇస్లాం మతానికి సంబంధించిన కీలకమైన అంశమని దానిని పోస్టర్ పై ప్రచురించడం ద్వారా ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలానే తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 8 ప్రకారం ఇందులో ముస్లిం మతానికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, సినిమాతో పాటు ప్రమోషనల్ వీడియోస్ నుండి వాటిని వెంటనే తీసివేయాలని కోరారు.
చిత్ర యూనిట్ ఏమందంటే!
ఇది కేరళలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తీసిన సినిమా మాత్రమే. మీ మనోభావాలు దెబ్బతిన్నట్లు అనిపిస్తే మా తరఫున ముస్లిం సోదరులకు క్షమాపణ తెలియజేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటనలో తెలియజేసింది.