ఆదివారంనాడు జరిగిన తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్‌రాజు అత్యధిక మెజార్టీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పోటీ అభ్యర్థి సి.కళ్యాణ్ దీనిపై సోమవారంనాడు ఓ విమర్శ చేశారు. ఎగ్జిబిటర్లు అంతా దిల్‌రాజుకు అమ్ముడుపోయారని అందుకే తాను ఓడిపోయానని వాపోయారు. దీనిపై ఎగ్జిబిటర్ల సంఘం అధ్యక్షుడు విజయేంద్రరెడ్డి ఓ వీడియోను విడుదలచేశారు.
ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్లు) అమ్ముడుపోయారని సి. కళ్యాణ్ చేసిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. 900 మందివి నిర్మాతల ఓట్లు కాగా, 400 ఓట్లు పంపిణీదారులవి. అందులో అధికభాగం దిల్‌రాజుకే ఓటు వేశారు. అదేవిధంగా డిస్టిబ్యూటర్ సెక్టార్ ఓటర్లలో 6-6, స్టూడియో సెక్టార్‌లో 3-1 ఓట్లు తేడావుంది. కనుక అత్యధిక మెజార్టీ దిల్‌రాజు సాధించాడు కాబట్టే మేము ఆయనకే ఓట్లు వేశాం.
గత మూడురోజులుగా ఈ ఎన్నికల దృష్ట్యా వ్యాపారపరంగా కళ్యాణ్‌గానీ, దిల్‌రాజు కానీ ఎవరు వచ్చినా మంచి జరగాలని మా మీటింగ్‌లో కోరుకున్నాం. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ప్రజల ఓట్లు ద్వారా దిల్‌రాజు గెలిచాడు. మెజార్టీ సాధించాడు. ఇక్కడ ఎగ్జిబిటర్లు అమ్ముడుపోవడం వుండదు. వారికి ఆ దుస్థితి రాదు.
ఏదైనా మెరిట్ థియేటర్ వుంటే ఏ సినిమాఅయినా అక్కడే ప్రదర్శిస్తారు. దిల్‌రాజుకు ఓటేస్తే మంచి థియేటర్ ఇస్తాడనేది అబద్ధం. కళ్యాణ్ తన మాటలు వాపసు తీసుకోవాలని విజయేంద్రరెడ్డి వీడియోలో తెలిపారు.