Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలిని బీట్ చేయడం రజనీకి కాదు గిజనీకి కూడా సాద్యం కాదు.. వై?

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా బాహుబలి ది కంక్లూజన్ చరిత్ర సృష్టించింది. ఆరురోజుల్లో 792 కోట్లరూపాయలు ఆర్జించిన ఈ సినిమా బారతీయ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా చరిత్ర కెక్కనుంది. వసూళ్ల పరంగ

Advertiesment
Rajnikanth
హైదరాబాద్ , శుక్రవారం, 5 మే 2017 (08:57 IST)
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా బాహుబలి ది కంక్లూజన్ చరిత్ర సృష్టించింది. ఆరురోజుల్లో 792 కోట్లరూపాయలు ఆర్జించిన ఈ సినిమా బారతీయ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా చరిత్ర కెక్కనుంది. వసూళ్ల పరంగా, ప్రజాదరణ పరంగా, రికార్డుల పరంగా అన్ని హద్దులనూ చెరిపివేసిన బాహుబలి అందరి అంచనాలను అధిగమించేసింది. ఇప్పుడు అంటే బాహుబలి తర్వాత దక్షిణాది పరిశ్రమ నుంచి వస్తున్న మరొక భారీ చిత్రం  రజనీ కాంత్ నటిస్తున్న 2.0
 
శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌గా వస్తున్న 2.0  బాక్సాఫీసు వద్ద బాహుబలి తరహా మ్యాజిక్‌ను సృష్టిస్తుందా అన్నదే సందేహం. పైగా బాహుబలి2 టిక్కట్లు అమ్ముడు పోయినంత తుపాను వేగాన్ని శంకర్, రజనీల చిత్రం ఛేదించగలదా అనే అనుమానం అందరిలో ఉంది. ఎందుకంటే బాహుబలి2ని యావద్దేశం ఆదరించడానికి చాలా కారణాలున్నాయి. ఒక తెలుగు సినిమా తన సొంత ప్రాంతం కంటే హిందీ ప్రాతంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టడం ఇదే మొదట సారి. ఇదెలా సాధ్యమని అంటున్నారంతా. 
 
అక్షయ్ కుమార్ వంటి పెద్ద స్టార్ 2.0 సినిమాలో ఉన్నప్పటికీ హిందీ మార్కెట్లో బాహుబలి2 లాగా చొచ్చుకుపోవడం సాద్యం కాదని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. రజనీ కాంత్ తాజా చిత్రం 2.0 తమిళనాడులో అసాధారణ రీతిలో సక్సెస్ కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తి సామర్థ్యతతో వసూలు చేయవచ్చు కానీ ఉత్తర అమెరికాలో బాహుబలి2 సృష్టించిన ఫ్రభంజనాన్ని అది కలిగించగలదా అనేది పెద్ద ప్రశ్న. ఉత్తర అమెరికాలో బాహుబలి 2... 300 కోట్లరూపాయల నికరాదాయాన్ని పొందే దిశగా అడుగులేస్తోంది.
 
అలాగే అమెరికాలోనూ, ఓవర్సీస్  బాక్సాఫీసు వద్ద బాహుబలి సాధిస్తున్న అసాదారణ రికార్డులను ఛేదించడం రజనీ శంకర్‌ల తరం కాదని అంచనా వేస్తున్నారు. 2.0 సినిమా భారీస్థాయిలో నిర్మించవచ్చు కానీ బాహుబలిని బీటే చేసే స్టామినా ఏ ప్రాంత చిత్రసీమకూ లేదన్నది గ్రహించాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాసరి నిజంగా మృత్యుంజయుడే.. ఆస్పత్రినుంచి సగమై వచ్చారు.