ఆర్.ఆర్.ఆర్. ప్రమోషన్ కోసం రాజమౌళి తన టీమ్‌తో బిజీగా వున్నారు. ఈనెల 18 నుంచి దుబాయ్‌లో మీడియాతో ఇంట్రాక్ట్ అవుతుండగా, 19న బెంగుళూరు దగ్గర సమావేశం కానున్నారు. ఆ తర్వాత నుంచి 22 వరకు తమ షెడ్యూల్‌ను రాజమౌళి వెల్లడించారు.
ఈనెల 20న బరోడా, ఢిల్లీలోనూ, ఈనెల 21న అమృత్‌సర్‌లో గెల్డెన్ టెంపుల్ సందర్శించుకుని ఆ తర్వాత అక్కడ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతారు. 21న జైపూర్, 22న వారణాసి, 22న కొల్కొత్తాలో మీడియాలో సమావేశం కానున్నారు. వీటితో దాదాపు ఇండియా అంతా పర్యటించినట్లయింది. ఈనెల 25న సినిమా విడుదల కాబోతోంది.
బాహుబలి తర్వాత ఎంతటి పేరు వచ్చినా రాజమౌళికి ఈ పర్యటనలు, పబ్లిసిటీలు తప్పడంలేదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పబ్లిసిటీ ముఖ్యంగా డి.వివి. దానయ్య తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సన్నిహితులు ఇంత పబ్లిసిటీ అవసరమా! అంటూ తనను అడుగుతున్నారనీ, కానీ ఎంత సినిమాకైనా పబ్లిసిటీ ముఖ్యమని చెప్పినట్లు తెలియజేస్తున్నారు.