Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈట్ సినిమా డ్రింక్ సినిమా అంటోన్న జీవిత‌ రాజశేఖర్

ఈట్ సినిమా డ్రింక్ సినిమా అంటోన్న జీవిత‌ రాజశేఖర్
, గురువారం, 23 డిశెంబరు 2021 (15:31 IST)
Poorna, Teja Tripurana, Jeevita Rajasekhar and others
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ 'బ్యాక్ డోర్' ఈనెల 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  బుధవారం రాత్రి హైద్రాబాద్, మాదాపూర్ లోని "డేట్ రెస్టారెంట్" లో ప్రి రిలీజ్ ఈవెంట్ అత్యంత కోలాహలంగా నిర్వహించారు.
 
స్నేహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ & అడిషనల్ ఎస్.పి. కె.జి.వి.సరిత, కథానాయకి పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 
"ఈట్ సినిమా... డ్రింక్ సినిమా..స్లీప్ సినిమాగా" అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి "బ్యాక్ డోర్" బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు "బ్యాక్ డోర్" వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో "బ్యాక్ డోర్" ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో థియేట‌ర్ల ప‌రిస్థితి ఏమిటి? ఆర్‌.ఆర్‌.ఆర్‌.పైనా ప్ర‌భావం!