Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినీ కార్మికుల సంక్షేమం కోసం E-SHRAM అవగాహన సదస్సు

సినీ కార్మికుల సంక్షేమం కోసం E-SHRAM అవగాహన సదస్సు
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (19:00 IST)
Naresh, naidu, sivabalaji
సినీ కార్మికులు, నటులు మరియు మా సభ్యులు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం E-SHRAM పథకం అమ్మలుకై సినీ నటులు డాక్టర్ నరేష్ వి.కె.సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి శ్రీనివాస్ నాయుడు గారితో అవగాహన సదస్సు నిర్వహించారు.
 
శ‌నివారంనాడు నాన‌క్‌రామ్‌గూడాలోని విజయ్ కృష్ణ గార్డెన్స్ లో డాక్టర్ నరేష్ వి కె. అద్యక్షతన సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిధి గా సినీ ఫెడరేషన్, చిత్రపురి హౌసింగ్ బోర్డ్ అదేక్షులు శ్రీ వల్లభనేని అనిల్ వికాస్ ఐక్యత ఇనిషియేటివ్ వ్యవస్థాపకులు.
 
ఈ కార్యక్రమంతో దాదాపు 22,000 సినీ కార్మికులకు E-SHRAM పథకం ద్వారా ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన మరియు 60సంవత్సరలు దాటిన వారికి నెలకు 3000/- పెన్షన్ మరియు త్వ‌ర‌లోనే అనుసంధానం చేయబోయే అనేక సంక్షేమ పథకాలకు అర్హులు ఆయేలా ప్రయత్నిస్తామని తెలిపారు.
 
త్వరలో కళాకారుల ఐక్య వేదిక సెంట్రల్ లేబర్ బోర్డ్ ఆధికారుల సహకారంతో E-SHRAM క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించారు 
 
ఈ కేంద్ర ప్రభుత్వ పథకం అసంగటిత కార్మికులకు ఒక పెద్ద వరం అని యూనియన్ లీడర్లు  తెలిపారు ముఖ్య అతిథిగా చైర్మన్ శ్రీ.V. srinivavas naidu మాట్లాడుతూ ఇప్పటికే 10కోట్ల  23లక్షల మంది నమోదైనట్లు తెలిపారు ఇందులోని పతకలని సినీ కార్మికులకి కూడా వర్తిస్తాయని తెలిపారు 
 
సభా అధ్యక్షులు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ, ప్రమాదకరమైన వాతావరణంలో పని చేసే సినీ కార్మికులకై E-SHRAM కేంద్ర పథకం ఒక పెద్ద బరోసా అని వ్యాక్యానించారు సినీ నటులకు మరియు 24crafts సంబంధంచిన సభ్యులు అందరకి ఈ పథకం అందే విధంగా కృషిచేస్తామని చెప్పారు . కనీసం 8నుండి10వేల మంది సినీ కుటుంబాలకు లబ్యుదరులుగా చేయడం మన తక్షణ కర్తవ్యంగా పేర్కన్నారు  
 
 శ్రీ శివ బాలాజీ మదల రవి మాట్లాడుతూ వైద్యం అందరకి అందుబాటులోకి తేవడానికి మేము ఎపుడు ముందుంటాం  అని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వికాస్ ఐక్యత ఇనిషియేటివ్ కన్వీనర్ శ్రీనివాస్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

BB5: టికెట్ టు ఫైనల్‌లో నలుగురు