Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ డబ్బింగ్ చెప్పిన స్పైడర్ మ్యాన్ - ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ పది భాషల్లో రాబోతుంది

Spiderman-Cricketer Shubman Gil
, గురువారం, 18 మే 2023 (19:42 IST)
Spiderman-Cricketer Shubman Gil
ఇండియన్ స్పైడర్ మాన్, పవిత్ర్ ప్రభాకర్‌కు భారత క్రికెటర్ శుభ్‌మాన్ గిల్  డబ్బింగ్ చెప్తారని మేకర్స్ ప్రకటించినప్పటి నుండి, ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ రోజు ముంబైలో జరిగిన ఈవెంట్ లో   పవిత్ర ప్రభాకర్ ను ప్రపంచానికి ప్రేక్షకులకు పరిచయం చేస్తూ "స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్" ట్రైలర్‌ను శుభమాన్ గిల్  విడుదల చేశారు.
 
ముంబై కి చెందిన పవిత్ర ప్రభాకర్ ను స్పైడర్ మ్యాన్ గా చూపిస్తున్నారు.  అలాగే తొలిసారిగా ఓ హాలీవుడ్ చిత్రం 10 భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్‌ లోని  డైలాగ్‌లు మరియు  గ్రాస్పింగ్ నేరేషన్  మనలని భారతీయ మూలాలకు కనెక్ట్ చేస్తుంది. మరియు స్పైడర్ మాన్ యొక్క ప్రపంచంలో మరోసారి మునిగిపోయేలా మనలను ఉత్తేజపరుస్తుంది. ఇండియన్  అభిమానులకు శుభవార్త ఏంటంటే  "స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్"  US విడుదల కంటే భారతదేశంలో ఒకరోజు ముందు విడుదల కానుంది. 
 
సోని పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ 'Spider-Man: Across the Spider-Verse'ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ మరియు బెంగాలీ భాషల్లో 1 జూన్ 2023న సినిమాల్లో మాత్రమే విడుదల చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరి జగన్నాథ్ హామీతో దీక్ష విరమించిన లైగర్ ఎగ్జిబిటర్స్