Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంది అవార్డు వేడుక పై తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏమంటుందో తెలుసా!

Advertiesment
chamber lettr-goud meeting
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (16:57 IST)
chamber lettr-goud meeting
గత కొంత కాలంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్యాలు నంది అవార్డులు ఇవ్వడం లేదని అందుకే తాను నంది అవార్డు  పేరుపై అవార్డులు ఇస్తున్నట్లు రామకృష్ణ గౌడ్‌ మీడియా సమావేశం పెట్టి  పలుసార్లు చెప్పాడు. మరి నంది పేరుపై అభ్యంతరం లేదని, తెలంగాణ మంత్రులను కూడా కలిసి చెప్పానని అన్నారు. ఆరోజు మురళీమోహన్, ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్ వంటి పెద్దలు కూడా హాజరయి వివరించారు. ఫైనల్ గా ఆ వేడుక రోజు రానే వచ్చింది. కానీ నేడు నంది అవార్డులపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక ప్రకటన చేసింది.
 
ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న దుబాయ్‌లో జరిగే నంది అవార్డ్‌ వేడుకకు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధలేదని తెలిపింది. దుబాయ్‌లో జరిగే నంది అవార్డుల వేడుక రామకృష్ణ గౌడ్‌ వ్యక్తిగతమని పేర్కొంది.  ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏపీ ేస్టట్‌ ఫిల్మ్‌ డెవలపమెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని  ఈవెంట్‌కు సంబందించి ఎలాంటి సమాచారం లేదని కూడా మేము అందరికీ తెలియచేస్తున్నాము. 
 
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ర్టీకి మాతృసంస్థ, మరియు తెలుగు  ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌చ, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తించబడిన సంస్థలు అని మరోసారి తెలియజేస్తున్నాం. ముఖ్యముగా తెలియచేయునది ఏమనగా 24-09-2023న దుబాయ్‌లో నిర్వహించబడే టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి పైన తెలియచేసిన రెండు ఛాంబర్‌లకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఈవెంట్‌లో మేం భాగం వహించము. ఇది తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి. రామకృష్ణ గౌడ్‌ నిర్వహించే వ్యక్తిగత మరియు ప్రైవేట్‌ ఈవెంట్‌. ఇది తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఛాంబర్‌ కాదు. నంది అవార్డు అనేది ఆంధ్ర రాష్ట్రానికి పేటెంట్‌ అయినందున, నంది అనే పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫ్‌సీసీ నంది అవార్డుల ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అందరికీ తెలియజేస్తున్నాం’’ అని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవ కార్యదర్శి  కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి కె.అనుపమ్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
 
మరి దుబాయిలో వేడుకలకు సిద్ధం కోసం దుబాయిలో ఉన్న రామకృష్ణ గౌడ్‌ ఏమి చెపుతాడో చూడాలి. మరి అప్పడు కామ్ గా ఉన్న పెద్దలకు ఇప్పడు ఏమని గౌడ్‌ ప్రశ్నిస్తాడో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనేనా చిత్రంతో రెజీనా కసాండ్రా భయపెడుతుందా!