Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబోయ్ తెలుగు సినిమా వద్దన్న బస్సులో ప్రయాణికులు... ఎందుకు?

Advertiesment
బాబోయ్ తెలుగు సినిమా వద్దన్న బస్సులో ప్రయాణికులు... ఎందుకు?
, శుక్రవారం, 28 జూన్ 2019 (15:17 IST)
ప‌ద్మ శ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా `మ‌ల్లేశం`. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశం సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా `మ‌ల్లేశం` సినిమా తెర‌కెక్కింది.

రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. మల్లేశం చిత్రం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ... మంచి సినిమా చేస్తే దాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆద‌రిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువయ్యింది. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుండగా బస్సులో డ్రైవర్ తెలుగు సినిమా వేశారు. ఆ సందర్భంలో అక్కడున్న పబ్లిక్ తెలుగు సినిమా వద్దు, ఎప్పుడూ చూసిన ఒకే మూస ధోరణిలో సినిమాలు ఉంటాయని చెప్పడం విన్న నాకు బాధేసింది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ధోరణి మారింది. కొత్త కథలు కొత్త దర్శకులు వస్తున్నారు. 
 
మల్లేశం లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి వెంకట్ సిద్దారెడ్డి కృషి ఎంతో ఉంది. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజ్ గారు ఈ సినిమాను చేయాలనుకోవడం అందులో నేను భాగం అవ్వడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఇటీవల వైజాగ్, రాజమండ్రి లో ఈ చిత్ర సక్సెస్ టూర్ ను నిర్వహించాం. అక్కడ వారి స్పందన చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్ చెబుతున్నాను"అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ చైత‌న్య‌.. చాలా ఫాస్ట్‌గా ఉన్నాడుగా..