Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంత ప్రేమకథనే ఖుషీగా తీశారా? బ్రేకింగ్ న్యూస్

Samantha latest
, మంగళవారం, 29 ఆగస్టు 2023 (16:54 IST)
Samantha latest
సమంత, విజయ్‌ దేవరకొండ నటించిన ఖుషీ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలవుతుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక ఈ సినిమా కథపై సోషల్‌ మీడియాలో చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సమంత లవ్‌ స్టోరీని దర్శకుడు తెరకెక్కించానే వార్తలు బయటకు వచ్చాయి. ట్రైలర్‌లో.. విజయ్‌, సమంత వివాహం చేసుకుని ఆదర్శంగా నిలవాలని శపథం చేసి పెండ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత చిన్నపాటి తగాదాలు చోటుచేసుకుంటాయి. ఓ సందర్భంలో సమంత అడిగిన ప్రశ్నలకు చిరాకెత్తిన విజయ్‌ దేవరకొండ తలుపు గట్టిగా వేస్తాడు. ఎందుకు అలా వేశావ్‌. అంటుంది. 
 
మరో సంఘటనలో ఇక్కడనుంచి వెళ్ళు! అని విజయ్‌ సీరియస్‌గా అంటాడు. అంటే లైఫ్‌లోనుంచి వెళ్ళిపోమనా? అని ప్రశ్నిస్తుంది. అదికాధమ్మా.. ఇప్పుడు వెళ్ళు అన్నానంతే. .. ఆ సమయానికి అలా అన్నట్లు అంటాడు. ఇలా గిల్లిగజ్జాలుతో సాగిన ఈ సినిమా సమంత లవ్‌ స్టోరీనే సినిమాగా తీశారనే  ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దానికి ఆయన ఏమన్నారో తెలుసా!
 
అవును. కొన్ని అనుభవాలనుంచే సినిమా కథను రాసుకున్నాను. అవి ఎవరివి అనేవి చెప్పను. సినిమా చూస్తే మీకే తెలుస్తోంది. సినిమా అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుంటుందని క్లారిటీ ఇచ్చాడు. సో. సమంత ఖుషీకి మరింత హైప్‌ చేశాడు దర్శకుడు. మరి సినిమా కోసం హైపా, సమంత రియల్ లైఫ్ ... తెలియాలంటే ఇంకా ఓన్లీ 2డేస్ వెయిట్ అండ్ సి... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జబర్ దస్త్ రాకింగ్ రాకేష్ హీరోగా కొత్త చిత్రం