రజనీకాంత్ ''నాన్ లోకలా''.. చిల్లర రాజకీయాలు మానుకోండి.. ధనుష్ ఫైర్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం దాదాపు ఖరారైనట్లేనని తమిళ నాట జోరుగా ప్రచారం సాగుతోంది. వారం రోజుల్లో లేదా మూడు నెలల్లోపు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని టాక్ వస్తోంది. తమిళనాట
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం దాదాపు ఖరారైనట్లేనని తమిళ నాట జోరుగా ప్రచారం సాగుతోంది. వారం రోజుల్లో లేదా మూడు నెలల్లోపు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని టాక్ వస్తోంది. తమిళనాట బలమైన రాజకీయ నేత లేకపోవడంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అమ్మ లేకపోవడం, కరుణ వృద్ధాప్యంతో రాజకీయాలకు దూరంగా ఉండటం ద్వారా.. తమిళనాట రాజకీయ సంక్షోభం తలెత్తింది.
దీంతో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే రైట్ టైమ్ అంటూ రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చేయడంతో ఆయన ఫ్యాన్స్, మెజార్టీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. కానీ కొందరు రాజకీయ నేతలు, సంఘాలు.. రజినీ స్థానికతను తెరపైకి తెచ్చి ఆందోళన చేపట్టారు. రజినీ తమిళుడు కాదంటూ.. ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే, వీరికి కౌంటర్‌గా రజినీ అభిమానులు కూడా భారీ ఆందోళన చేపట్టారు. రజినీ కూడా తాను పక్కా తమిళుడినేనంటూ ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్‌కు నాన్ లోకల్ విషయమై.. ఆయన అల్లుడు, హీరో ధనుష్ కూడా మద్దతు తెలిపారు. రజనీకాంత్ స్థానికతపై పలు సంఘాలు ఆందోళన చేపట్టడాన్ని ధనుష్ తప్పుపట్టారు. వారంతా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే తమిళ ప్రజలకు మంచి జరుగుతుందని ధనుష్ ఆకాంక్షించారు. రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అందుకు తాను పూర్తి మద్దతిస్తానన్నారు. తమిళ ప్రజల గుండెల్లోనే రజనీకాంత్ ఉన్నారని ధనుష్ వెల్లడించారు.