మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమా ధమాకా. శ్రీలీల నాయిక. త్రినాథరావు దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందింది. ఈ సినిమా విడుదలకు ముందు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఉప్పర కులస్థులు గొడవ చేశారు. ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు మాట్లాడిన ఓ సందర్భంగా ఉప్పర మీటింగ్ అంటూ నటీనటులను ఉద్దేశించి అన్నాడు. దాంతో అది పెద్ద రాద్దాంతం అయింది. విడుదలకు ఒకరోజు ముందు క్షమాపణ చెప్పారు. ఆరోజు మాట్లాడుతూ, రవితేజకు అందరూ ఫ్యాన్స్ ఉప్పర కులస్థులుకూడా సపోర్ట్ చేసి సినిమాకు మంచి విజయం చేకూర్చాలని వేడుకొన్నాడు. సినిమా విడుదల తర్వాత రొటీన్‌కథగా వుంది. కొన్ని సినిమాల స్కూప్‌తో సినిమాను లాగించేశాడు అని విమర్శలు వచ్చాయి.
కానీ వాటితోపాటు, రవితేజ ఎనర్జీ సినిమాను నిలబెట్టిందని ట్రేడ్ వర్గాలు భావించాయి. అందుకే ఇప్పుడు మాస్ ప్రేక్షకులుతోపాటు ఓవర్‌సీస్ ప్రేక్షకులుకూడా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో నేటికి 100 క్లబ్‌లో చేరిందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో బీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా ప్లస్ అయిందనీ, అన్నివర్గాలవారు మా సినిమాను హిట్ చేశారని ఈరోజు దర్శకుడు త్రినాథ్ ఆనందంవ్యక్తం చేస్తున్నారు. మరి సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు విడుదల కావడంతో అప్పటివరకు సరైన సినిమాలు లేకపోవడంతో రవితేజ హవా కొనసాగుతుందని అంచనా.