తెలుగు సినీ చరిత్రలో ఎవరూ ఇంతవరకు చేయనటువంటి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం `దేశం కోసం భగత్ సింగ్`. గతంలో అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం లాంటి చిత్రాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. రవీంద్రజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.
దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించగా, మిగిలిన తారాగణం పాత కొత్త నటీనటుల కలయికలతో నిర్మించారు. సాంకేతిక వర్గం: కెమెరాః సి. వి. ఆనంద్, సంగీతంః ప్రమోద్ కుమార్, మాటలుః సూర్యప్రకాష్,రవీంద్ర గోపాల, పాటలుః రవీంద్ర గోపాల, ఎడిటింగ్ః రామారావు, కోడైరెక్టర్ః రామారావు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాతః రవీంద్రజి. బ్యానర్ః నాగలక్ష్మి ప్రొడక్షన్స్