దాసరికి చికిత్స... ఆసుపత్రి బిల్లు ఎంతో తెలుసా? వామ్మో....
పెద్దవాళ్లకు భరించే శక్తి వుంటుందంటారు. అది ఏదయినా... దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యం గురించి తెలిసిందే. ఆయనను మార్చి 30న డిశ్చార్జ్ చేయబోతున్నారు. నెల రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే వున్నారు. దాసరికి వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో విఐప
పెద్దవాళ్లకు భరించే శక్తి వుంటుందంటారు. అది ఏదయినా... దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యం గురించి తెలిసిందే. ఆయనను మార్చి 30న డిశ్చార్జ్ చేయబోతున్నారు. నెల రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే వున్నారు. దాసరికి వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో విఐపి ప్రత్యేక గదలున్నాయి. వీటిలోనే ఆయనను ఉంచి చికిత్స అందించారు. ఆయన వున్న గదికి ఒక్కరోజుకి అద్దె రూ. 40 వేలు. ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతూ వుంది కనుక ప్రక్కనే ఆయన కుటుంబ సభ్యులు కూడా బస చేశారు.
వారు కూడా రెండు విఐపి సూట్లను తీసుకోవడంతో మొత్తం కలిపి 1.20 లక్షలు ఒకరోజు అద్దెన్నమాట. ఇంకా దాసరిని పరామర్శించేందుకు వచ్చేవారి కోసం మరికొన్ని సూట్లు తీసుకున్నారు. వారికి భోజనం, టీలు, టిఫిన్లు... ఇలా మొత్తం కలిపి బిల్లు రూ. 90 లక్షల వరకూ చేరిందట. బిల్లు ఒక రేంజిలో దూసుకుపోతూ వుండటంతో వారం రోజుల క్రితం దాసరి వీఐపి సూట్ నుంచి సాధారణ గదికి వచ్చేసినట్లు సమాచారం. ఈ బిల్లును దాసరి నారాయణ రావు పే చేస్తారో లేదంటే ఆయన మాజీ కేంద్ర మంత్రి కనుక ప్రభుత్వమేమైనా కడుతుందోననే చర్చ నడుస్తోంది.