Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాసరి జయంతి ఫంక్షన్ డిజాస్టర్ - డైరెక్టర్స్ అసోసియేషన్ ఫెయిల్

Directors Association

డీవీ

, శుక్రవారం, 24 మే 2024 (10:18 IST)
Directors Association
మే 19 న ఎల్.బి. స్టేడియంలో దాసరి జయంతి సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ ఫంక్షన్ డిజాస్టర్ అయింది. దీనికి పూర్తి బాధ్యత డైరెక్టర్స్ అసోసియేషన్ తీసుకుని తప్పిదం జరిగిందని లిఖతపూర్వకంగా సంఘం ప్రతినిధులకు తెలియజేసింది. అసలు మే 4 న జరగాల్సిన వేడుక రాజకీయ కారణాలవల్ల వాయిదా పడింది. తిరిగి మే 19 న జరపుతున్నట్లు ముఖ్యమంత్రితోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వాన ప్రతాలు అందజేశారు. కానీ నిర్వహణ విషయంలో ఘోరంగా ఫెయిల్ అవడం విడ్డూరంగా వుంది.
 
అందుకు క్షమించమని కోరుతూ దర్శకుల సంఘం నుంచి లెటర్ తెలియజేసింది. దాని సారాంశాన్ని ధన్యవాదాలు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు,  మరియు కమిటి.ఇలా తెలియజేసింది.
గౌరవనీయులైన తెలుగు చలనచిత్ర దర్శక సంఘ సభ్యులకు,
 ముందుగా మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 
దర్శక కుటుంబం మనం మనకోసం చేసుకున్న ఈ ఈవెంటుకు అభిమానంతో విచ్చేసారు….
 
కానీ, పలు పొరపాటులు, సమన్వయలోపం వల్ల, ఈవెంట్ మేనేజర్ల అవగాహన లోపం వల్ల మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, గౌరవించుకోలేకపోయాము. 
ఇది ముమ్మాటికి మా వల్ల జరిగిన తప్పు. దీనికి మా కమిటీ అందరూ చింతిస్తున్నాము.
దాదాపుగా తొమ్మిది వేల మంది హాజరైన ఈ కార్యక్రమానికి సరైన అనుభవంలేని, క్రౌడ్ మానేజ్‌మెంటుపై పట్టులేని కొత్త ఈవెంట్ మానేజింగ్ సంస్థవల్ల మనం మన కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందిని చవిచూడాల్సి  వచ్చింది. కేవలం నష్టం వచ్చినా తాము భరిస్తామన్న agreement తో కొత్తవారైనా వారికి ఇవ్వవలసి వచ్చిందన్న విషయాన్ని మీరు అర్థంచేసుకోగలరని భావిస్తున్నాం.
అన్ని వేలమందికి సంబంధించిన పార్కింగ్‌ సౌకర్యం లేనందున చివరి నిముషంలో వెన్యూ మార్చాల్సి ఉంటుందనే కన్‌ఫ్యూషన్‌లో తగిన సౌకర్యాలు కల్పించలేక పోడంలో విఫలం అయ్యాము.
 
 1. వేల వాటర్‌బాటిల్‌ స్టాక్ వెన్యూలోనే ఉన్నా కూడా సప్లై చేసే వ్యవస్థ లోపం వల్ల మన సభ్యులకు మంచినీరు అందలేదు.
2. ఐపీయల్ కూడా జరుతున్న నేపథ్యంలో బయో టాయిలెట్లను మనకు  సప్లై చేస్తా అని ఒప్పుకున్న వెండరు చివరి నిముషంలో వెను తిరిగాడు.
3. వెన్యూ మారుతుందనే కన్‌ఫ్యూషన్‌లో ముందుగానే ఆర్డర్ ఇచ్చిన ‘స్నాక్స్ & రిఫ్రెష్మెంట్స్’ కూడా  ఈవెంట్‌మానేజింగ్ కంపెనీ మరియు వెండర్ అందజేయలేక పోయారు. 
4. అనుకున్న దానికంటే ఎక్కువ మంది చివరి నిముషంలో  హాజరు అవడంచో సీటుంగ్ లో కూడా లోపాలు జరిగాయి.
 
పైన పేర్కొన్న లోపాలతో పాటూ, స్టేజ్ సమయానికి రెడీ అవ్వకపోవడంతో అనుకున్న అనేక AVలు , ఇతర ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలను కూడా సజావుగా నిర్వహించలేకపోయాము.
ఏది ఏమైనప్పటికి ఇలాంటి అవకతవకల వల్ల మన కుటుంబ సభ్యులు,  స్త్రీలు, పిల్లలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసివచ్చింది.
 
మా వల్ల జరిగిన ఈ తప్పును మీరు సహృదయంతో మన్నించగలరని, ఇకమీదట ఇటువంటి పొరపాటులు జరగకుండా జాగ్రత్త వహిస్తామని మాట ఇస్తున్నాము.
మన సభ్యుల ఇన్‌ష్యురెన్స్ కోసం, ఇతర అవసరాలకోసం మనకై స్వయంసంవృద్దిగా వుండటం కోసమే మనం ఈ కార్యక్రమం ఏర్పాటుచేసుకున్నాము. దానికి ఎటువంటి లోపం గానీ జాప్యం గానీ జరగకుండా పనులను ముగించి త్వరలో జనరల్‌బాడీని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము
 
మన సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఈ కమిటీని సహృదయంతో మన్నించగలరని తదుపరి పనులను వేగవంతంగా పూర్తి చేయడంలో అందరూ మనస్పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాము.
స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించి సహృదయంతో మన్నించగలరు…

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి వల్లే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ లో ప్రభాస్ కు గాత్రం ఇచ్చిన శరద్ కేల్కర్