Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాలు రోత రోత.. ఎన్టీఆర్, వైఎస్సార్ గ్రేట్.. సినీ పరిశ్రమ వల్లే డ్రగ్స్ పెరగలేదు

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జంప్ జలానీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని స

Advertiesment
రాజకీయాలు రోత రోత.. ఎన్టీఆర్, వైఎస్సార్ గ్రేట్.. సినీ పరిశ్రమ వల్లే డ్రగ్స్ పెరగలేదు
, బుధవారం, 16 ఆగస్టు 2017 (10:34 IST)
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జంప్ జలానీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని సురేష్ బాబు తెలిపారు. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవడంలో వీరికి ఎవరూ సాటిరారని కొనియాడారు.  
 
అయితే ప్రస్తుత రాజకీయ నేతలు ప్రజలచే ఎన్నుకొనబడుతున్నామనే విషయాన్ని మరిచి.. పదవి కోసం, అధికారం కోసం ఇతర పార్టీలకు మారిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఒక పార్టీ తరపున పోటీచేసి గెలిచాక.. మరో పార్టీ ఆశచూపితే ఆ పార్టీరి జంప్ కావడం ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుందన్నారు. 
 
జనం పార్టీ మీదో, లేదా రాజకీయ నేతపైనే నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే.. ఆ పార్టీకి పనిచేయక పార్టీలు మారడం విలువలను వదులుకోవడమే అవుతుందని సురేష్ బాబు తెలిపారు. నమ్మి ఓటేసిన ఓటర్లను మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మద్యం, డ్రగ్స్, ధూమపానం సినిమాలు రాకముందు నుంచే ఉన్నాయని... సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని చెప్పారు. ఏ రంగానికైనా క్రమశిక్షణ అనేది అవసరమన్నారు..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడు చలపతి, హీరో సృజన్ కారులో తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు...