Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణ వేడుకలకు ఇండస్ట్రీ మన కుటుంబంగా భావించి తలరిరండి : ఫిలిం ఛాంబర్ పిలుపు

Flim chamber kamity

డీవీ

, శనివారం, 31 ఆగస్టు 2024 (10:17 IST)
Flim chamber kamity
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న  హైదరాబాద్ హైటెక్స్  నోవోటెల్ హోటల్లో  తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఎంతోమందికి ఆహ్వానాన్ని అందించారు. అయితే కొంతమందికి ఆహ్వానాలు అందలేదని వస్తున్న వార్తలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
 
ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘తెలుగు సినీ రంగంలోని అన్ని శాఖలు కలిసి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులు వస్తారు. ఈ ఈవెంట్‌ను శ్రేయాస్ మీడియా నిర్వహిస్తోంది. ఇన్విటేషన్స్ అందలేదని మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అన్ని యూనియన్ల ద్వారా సభ్యులందరికీ పీడీఎఫ్ రూపంలో అందరికీ పంపించాము. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబ అని భావించి అందరికీ ఇదే మా వ్యక్తిగత ఆహ్మానం అని భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ కల్యాణ్, అనుపమ్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సీ కల్యాణ్, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్ కుమార్, మాదవపెద్ది సురేష్, సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్టీ జోనర్ ఫిల్మ్ నేను - కీర్తన ఎలా వుందంటే రివ్యూ