Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలయాళ రీమేక్.. వెండితెరపై పవన్-రానా కాంబో‌.. నివేదా థామస్ హీరోయిన్‌గా..?

Advertiesment
మలయాళ రీమేక్.. వెండితెరపై పవన్-రానా కాంబో‌.. నివేదా థామస్ హీరోయిన్‌గా..?
, సోమవారం, 21 డిశెంబరు 2020 (11:05 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పవన్ ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇంకొన్ని రోజుల్లో మొత్తం షూటింగ్ ముగియనుంది.
 
ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో కీలక పాత్రలో రానా నటిస్తున్నాడని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన విడుదలైంది.
 
మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం.. రానాను ఆ క్యారెక్టర్ కోసం చిత్రబృంద సంప్రదించిదట. ఆ పాత్రకు రానాకు కూడా నచ్చడంతో.. నటించడానికి రానా ఒకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో రానా సరసన నివేధా నటించే అవకాశం ఉందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని : ఆర్కే రోజా