Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలన్‌గా మారనున్న సునీల్.. అదృష్టం వరిస్తుందా?

Advertiesment
విలన్‌గా మారనున్న సునీల్.. అదృష్టం వరిస్తుందా?
, బుధవారం, 1 జనవరి 2020 (15:35 IST)
హాస్యనటుడిగా తనదైన టైమింగ్‌తో కూడిన పంచ్‌లతో ప్రేక్షకులను అలరించిన సునీల్... హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని వెనక్కి వచ్చేసి తన కామెడీ ఆర్టిస్ట్ రోల్‌లతో సరిపెట్టుకుంటూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. 
 
దర్శకుడు తివిక్రమ్ సాయంతో ‘అరవింద సమేత’ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. 
 
అయితే, ఇన్నిరోజులూ కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు. ఈ మేరకు ఆయన విలన్‌గా ఒక కొత్త సినిమాను అంగీకరించారు. ఈ సినిమా ద్వారా యంగ్ కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నారు.
 
వివరాలలోకి వెళ్తే... సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్, సందీప్‌లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న కలర్ ఫోటో సినిమాలో సునీల్ విలన్‌గా కనిపించబోతున్నారట. తాజాగా నాచురల్ స్టార్ నాని చేతుల ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైన సందర్భంగా చిత్ర బృందం ఈ వివరాలను ప్రకటించింది.
 
హీరోగా కంటే కామెడీ ఆర్టిస్ట్‌గా ఉండడమే బెటరనుకున్న సునీల్ మరి విలన్‌గా ఎలా ఉండబోతున్నాడో వేచి చూద్దాం...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాజిక మాథ్యమాన్ని అలా వాడుకుంటానంటున్న శ్రద్థాకపూర్