Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

డీవీ

, మంగళవారం, 2 జులై 2024 (17:29 IST)
CM Revanth Reddy
సినిమారంగంలోని నిర్మాతలు, హీరోలు తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలని ఈరోజు కండిషన్ పెట్టారు. సినిమా టికెట్లను పెంచమని ప్రభుత్వం దగ్గరకు వచ్చే నిర్మాతలు నటీనటులతో మూడు నిముషాల నిడివిగల వీడియోలను సమాజానికి  ఉపయోగపడే విధంగా తీసి థియేటర్లలో ప్రొజెక్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. 
 
సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగానే కల్పించాలి. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమా కు ముందు ప్రదర్శించాలి. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదు. అందుకే డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియో తో అవగానే కల్పించాలి అని కోరారు. 
 
అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు. సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలి. డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లు లో ప్రసారం చేయక పోతే మీ థియేటర్లు కు అనుమతి వుండదని తెలిపారు.
 
ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి అవేర్నెస్ వీడియో చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందించార‌ని.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు రేవంత్ తెలిపారు. ఇక‌పై ఫిలిం ఇండ‌స్ట్రీ నుంచి ఇలాంటి సోష‌ల్ అవేర్నెస్ వీడియోలు ఎక్కువ‌గా రావాల‌ని ఆయ‌న సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..