Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా నాకు ఆక్సిజన్ తో సమానం. అది నా ఊపిరి :కథానాయకుడు నాని

Advertiesment
nani, Souryuv and others
, శనివారం, 25 నవంబరు 2023 (11:19 IST)
nani, Souryuv and others
నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా నటించిన సినిమా 'హాయ్ నాన్న'. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ లాంచ్ చేశారు.
 
నాని ఒక రాజు కథను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అందులో తల్లి పాత్ర లేనప్పుడు, పాప తన తల్లి కథను చెప్పని కోరుతుంది. అతను ప్రతిదీ వివరిస్తాడు కానీ ఆమె తల్లి గురించి ఏదో దాచిపెడతాడు. కథలో చాలా ఎమోషన్ ఉంది, దీంతో పాప తన తల్లి గురించి తండ్రిని ఇబ్బందిపెట్టాలని అనుకోదు. కథలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పాప కొత్త స్నేహితురాలు యష్నా (మృణాల్)ని తన తల్లిగా ఊహించుకుంటుంది. అయితే, శృతి హాసన్, విరాజ్ భార్యగా, మహి తల్లిగా రివిల్ అవుతుంది.
 
ట్రైల‌ర్ ముందుకు వెళుతున్న కొద్దీ క‌థ‌లో చాలా లేయ‌ర్లు ఆసక్తిగా తెరపైకి వస్తాయి. ప్రేమకథలో మ్యాజిక్ ఉంది, తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రతిఒక్కరినీ హత్తుకుంటుంది. దర్శకుడు శౌర్యువ్  పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ని అద్భుతంగా మలిచాడు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు భిన్నంగా కథను చాలా కొత్త తరహాలో ప్రజెంట్ చేశాడు.
 
రొమాంటిక్ సీక్వెన్స్‌లు,  ఎమోషనల్ ఎపిసోడ్స్ , ప్రతి ఫ్రేం లో టాప్-నాచ్ కెమెరా యాంగిల్స్‌,  లైటింగ్‌ తో  సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్‌ ప్రేక్షకులని కట్టిపడేశారు. గోవా, కూనూర్ మొదలైన అద్భుతమైన  లొకేషన్‌లు చాలా బ్యూటీఫుల్ గా చిత్రీకరించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  క్లాస్‌తో పాటు ఎమోషనల్ కనెక్షన్‌ని అద్భుతంగా జోడిస్తుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ మరో ఆకర్షణ. మొత్తం మీద, హాయ్ నాన్న ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్సులు, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్‌తో అద్భుతమైన టెక్నికల్ వర్క్ తో ఎమోషనల్ రైడ్‌ను అందిస్తుంది. 'హాయ్ నాన్న' తప్పకుండా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.
 
ట్రైలర్ అనంతరం నాని మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చుసుకున్నపుడు ‘వీడెవడో బావున్నాడు’ అని అనిపించింది ‘హాయ్ నాన్న’ సినిమాకే(నవ్వుతూ). శౌర్యువ్ రాసుకున్న కథలో సాన్ జాన్ చూపించిన విజివల్స్ చాలా బావుంటాను. టీజర్ పాటలు ఇప్పుడు ట్రైలర్ చూశారు. కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత వుంది. మీరంతా సినిమాతో ప్రేమలో పడిపోవడం ఖాయం. సినిమా అనేది నాకు ఆక్సిజన్ తో సమానం. సినిమా అనేది నిజంగా నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా... డిసెంబర్ 7కి మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ భాద్యత నాది, మా టీం అందరిది. బాక్సాఫీసు బాధ్యత మీది. ప్రామిస్. అందరికీ పేరుపేరునా లవ్ యూ సో మచ్’’ అన్నారు.
 
రైటర్ కాశి మాట్లాడుతూ..  ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు. శౌర్యువ్ అద్భుతమైన కథ రాశారు. ఈ కథ విన్న తర్వాత స్పెల్ బౌండ్ అయిపోయాను. కొత్త రచయిత దర్శకులకు స్ఫూర్తిని ఇచ్చే హీరో నాని గారు. మంచి కథని ప్రోత్సహించే హీరో. ఆయనకు కథ నచ్చితే చాలు. మరో విషయం గురించి అలోచించరు. శౌర్యువ్ గారి ప్రతిభని డిసెంబర్ 7న చూస్తారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు. ఈ వేడుకలో దర్శకుడు శౌర్యువ్, నిర్మాత మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 
మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎడిటర్‌గా ప్రవీణ్‌ ఆంథోని, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా సతీష్‌ ఈవీవీ వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాయ్ నాన్నాపై ఆశలు పెట్టుకున్న సీతారామం హీరోయిన్