Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట'.. చింత తొక్కుతో చేపల గుజ్జు : (Video)

Advertiesment
'అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట'.. చింత తొక్కుతో చేపల గుజ్జు : (Video)
, సోమవారం, 10 ఆగస్టు 2020 (12:04 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దీంతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఈయన లాక్డౌన్ సమయంలో అపుడపుడూ పాకశాస్త్ర నిపుణుడి అవతారమెత్తుతున్నాడు. తాజాగా చిత్త తొక్కుతో చిన్న చేపల గుజ్జు అనే వంటకాన్ని తయారు చేసి, తన తల్లి అంజనాదేవికి వడ్డించారు. పైగా, తాను చేసిన వంటను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 
 
సముద్రపు ఆహారాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే చిరంజీవి చేప‌ల వేపుడు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. త‌న అమ్మ చేసిన వంటైతే మ‌రీ ఇష్ట‌మ‌ట‌. సండే ఖాళీగా ఉన్నందున 'అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట' అంటూ వంటలోని తన నైపుణ్యాన్ని చూపించారు.
webdunia
 
'చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…' చేశానంటూ చిరు.. ఆ వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ఇందులో తాను ఆ వంట‌కం క్లియర్‌గా వివ‌రించారు.  
 
ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. చిరు కోడ‌లు ఉపాస‌న మెగాస్టార్ వంటకి ఫిదా అయిన‌ట్టు కామెంట్ పెట్టింది. ఇదిలావుంటే మ‌రి కొద్ది రోజుల‌లో రానున్న చిరు బ‌ర్త్‌డేకి సంబంధించిన హంగామా ఇప్ప‌టికే మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్మను చూస్తే కరోనా అయినా సరే పారిపోవాల్సిందే..?!