Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిటైర్‌మెంట్‌ గురించి చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్

chiru speech
, బుధవారం, 28 డిశెంబరు 2022 (05:32 IST)
chiru speech
మెగాస్టార్‌ చిరంజీవి తన రిటైర్‌మెంట్‌ గురించి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాకుండా తన తోటివారు కూడా నటీనటులు ఇలాగే ఆలోచించాలని అన్యాపదేశంగా సెలవిచ్చారు. లేటెస్ట్‌గా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. బాబీ దర్శకుడు. మైత్రీమూవీస్‌ నిర్మాతలు. ఈ సినిమాలో రవితేజ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ఆ పాత్ర సినిమాను నిలబెడుతుందని ఆశిస్తున్నారు.
 
ఇదిలా వుండగా, హైదరాబాద్‌ శివార్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో వాల్తేరు వీరయ్యకు చెందిన ఓ సెట్‌ను వేశారు. అక్కడ పాటలు చిత్రీకరించారు. ఓ పాటను ఇటీవలే విదేశాల్లో చిత్రించారు. అక్కడ మైనస్‌ 8 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నా చలిలో కూడా వణుకుతూ, గడ్డకట్టే చలిలోనూ చేశారు. ఇది చాలా కష్టమైందని, ఇష్టంతో చేశాననీ ఓ వీడియోను కూడా ఇటీవలే విడుదల చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ఓ విలేకరి ప్రశ్నిస్తూ, ఇంత మెగాస్టార్‌ అయి వుండి. అంత చలిలోనూకష్టపడి చేయడం అవసరమా! అని అడిగితే ఆయన ఇలా సమాధానం చెప్పారు.
 
యస్‌. మీరన్నది కరెక్టే. అలానే చేయాలి. లేదంటే రిటైర్‌మెంట్‌ తీసుకుని ఇంట్లో కూర్చోవాలి. నేనేకాదు. నాతోటి వారికి చెబుతున్నా. నేను మొదట్లో నటుడిగా ఎంత ఆకలితో, కసితో చేశానో అలాగే చివరివరకు చేయాలి. ఇష్టంతో చేయాలి. అప్పుడు అనుకున్నట్లుగా ఔట్‌పుట్‌ రాగలదు. నేను గడ్డకట్టే చలిలో, మంచులో సాంగ్‌ చేయాల్సివచ్చింది. నాతోపాటు శ్రుతిహాసన్‌, ఇతర టీమ్‌ కూడా అక్కడ వున్నారు. కాలు వేస్తే మంచులో కూరుకుపోతుంది.

రగ్గులు కప్పుకుని డాన్స్‌ చేయకూదు. ఓ దశలో కాలు కూరికిపోయి కాలికి బొబ్బలు వచ్చాయి. అంటే అంత బాగా మంచు బాడీకి పట్టింది. ఆ తర్వాత దాన్ని వేడి చేసుకుని నానా తిప్పలు పడ్డాం. అలాగే మొన్ననే సముద్రంలో ఓ సీన్‌ చేయాలి. నీళ్ళలో ఫైటర్లతోపాటు చాలాసేపు వున్నాను. అది చూసి కెమెరామెన్‌ అడిగారు. సార్‌. మీలాంటి హీరోలను చూడలేదు. చాలామంది డూప్‌తో చేస్తారు. అని అన్నారు. నేను ఇలాగే చేస్తాను. మొండిగా చేస్తాను. కష్టపడతాను.. అంటూ క్లారిటీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోహెల్‌కు ఐలవ్యూ చెప్పిన ఇనయా.. వీడియో వైరల్