Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగ్లీ `యోగితత్వం` తిల‌కిస్తున్న చిరంజీవి(Video)

Advertiesment
మంగ్లీ `యోగితత్వం` తిల‌కిస్తున్న చిరంజీవి(Video)
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:25 IST)
Magli, chiru, damu reddy
ప్రముఖ గాయని మంగ్లీ పాడిన 'యోగితత్వం' పాటను 'మెగాస్టార్' చిరంజీవి విడుదల చేశారు. 'యోగితత్వం' గీతాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి సాంగ్ యూనిట్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. దాము రెడ్డి ఈ పాటకు దర్శకత్వం వహించారు. బాజి సంగీతాన్ని సమకూర్చగా ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది.

అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్., 'నా గురుడు నన్నింకా యోగి గమ్మననె, యోగి గమ్మననె, రాజయోగి గమ్మననె..' అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు.
 
మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో 'యోగితత్వం' పాట అప్ లోడ్ అయ్యింది. మంగ్లీ పాటలను ఇష్టపడేవారు ఈ పాటకు హయ్యెస్ట్ వ్యూస్ ఇవ్వనున్నారు. శివాణి మాటూరి సమర్పణలో రూపొందిన ఈ పాటకు సినిమాటోగ్రఫీ - తిరుపతి, ఎడిటర్ - ఉదయ్ కంభం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం