Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాతకర్ణిపై విన్నర్ ఏమన్నాడంటే? మెగా హీరో ట్వీట్‌పై నందమూరి ఫ్యాన్స్ ఖుషీ.. చిరు ఫ్యాన్స్ వార్..

సంక్రాంతికి వచ్చిన పెద్ద హీరోల సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడింది. మెగా అభిమానులంతా ఇప్పటికే 'ఖైదీ నంబర్ 150' సినిమాకు పట్టం కట్టారు. తొలిరోజు 'బాహుబలి' రికార్డులకు ఎసరు పెట్టే విధంగా ఉన్న ట్రేడ్ రిపో

Advertiesment
chiranjeevi fans fires on sai dharam tej tweet about gautamiputra
, గురువారం, 12 జనవరి 2017 (16:35 IST)
సంక్రాంతికి వచ్చిన పెద్ద హీరోల సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడింది. మెగా అభిమానులంతా ఇప్పటికే 'ఖైదీ నంబర్ 150' సినిమాకు పట్టం కట్టారు. తొలిరోజు 'బాహుబలి' రికార్డులకు ఎసరు పెట్టే విధంగా ఉన్న ట్రేడ్ రిపోర్ట్ తో మెగాస్టార్ చిరంజీవి ఒడ్డున పడ్డట్లే భావిస్తున్నారు. ఇక ఇప్పుడు అందరి చూపులు నందమూరి నటసింహం బాలకృష్ణ "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమా టాక్‌పై పడింది.
 
శాతకర్ణి సినిమాకు విమర్శకుల నుంచి మంచి పేరు లభించడంతో పాటు నందమూరి ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో శాతకర్ణిపై మెగా హీరో ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, నందమూరి సినిమాపై ట్వీట్ చేయడంతో అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి గ్రేట్ రిపోర్ట్స్ వింటున్నానని, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపాడు సాయి ధరమ్ తేజ్ .
 
అంతే కాదు "మాలో చాలా మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు" అంటూ సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌తో ఈ మెగా హీరో వ్యక్తిత్వం ఏమిటో బయటపడింది అంటూ బాలయ్య అభిమానులు ఈ యంగ్ మెగా హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
అయితే చిరంజీవి ఫ్యాన్స్ సాయి ధరంతేజ్‌పై రిప్లైల యుద్ధం ప్రకటించారు. ‘ఇక చాలు ఊరుకో.. మన సినిమాకి ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు కాని, నువ్వు అభినందనలు చెపుతావా..’ అని ఒకరు, ‘నువ్వెంత పొగిడినా నీ సినిమాకి వారి అభిమానులు రారు’ అని మరొకరు ట్వీట్లతో తిట్టి పోసారు. 
 
కొంతమందైతే వార్తలో రాయలేని పదజాలం ఉపయోగించారు. పాపం ట్వీట్ అనవసరంగా చేసానే అని సాయిధరం ఫీలయ్యేలా రిప్లై ఇచ్చారు మెగా అభిమానులు. కాగా, నందమూరి హీరో కల్యాణ్ రామ్, మెగా హీరో సాయిధరం తేజ్ కలసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్‌పై రెహమాన్ పాట.. రూ.500 చెల్లకపోయినా.. ట్రంప్‌ ప్రెసిడెంట్‌ అయినా టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీ