ధనుష్ నటించిన విఐపి, ఎక్స్‌ప్రెస్ రాజా, ఓటర్ వంటి చిత్రాలలో సురభి పురాణిక్ నటించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో సురభి నటిస్తోంది. తాజా షెడ్యూల్‌లో చిరంజీవి సరసన తన పార్ట్ షూట్‌ను ప్రారంభించింది సురభి.
ఇటీవల సురభి పురాణిక్ మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్‌తో కలిసి పనిచేయడం థ్రిల్‌గా ఉందని వెల్లడించింది. చిరు తనకు ప్రత్యేక సలహా ఇచ్చారని, నటుడిగా బహుముఖంగా ఉండటమే ముఖ్యమని చెప్పారని సురభి పురాణిక్ వెల్లడించింది.
విశ్వంభరలో తన పాత్ర గురించి నటి మాట్లాడుతూ, విశ్వంభరలో తన పాత్ర కీలకమని చెప్పింది. విశ్వంభర చిత్రంలో ఆమె సాంప్రదాయ హాఫ్-చీరలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
UV క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.