Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను : బబుల్‌గమ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల

Music Director Shri Charan Pakala
, బుధవారం, 27 డిశెంబరు 2023 (17:03 IST)
Music Director Shri Charan Pakala
ప్రతి రంగం అడ్వాన్స్ అవుతూనే వుంటుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. అయితే ఎంత ఏఐ అడ్వాన్స్ అయినప్పటికీ ఎమోషన్ కనెక్ట్ చేయాలంటే హ్యూమన్ టచ్ వుండాల్సిందే. పర్సనల్ కనెక్షన్ హ్యూమన్ టచ్ తోనే సాధ్యపడుతుందని నమ్ముతాను అని బబుల్‌గమ్’ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల అన్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో మానస చౌదరి హీరోయిన్. డిసెంబర్ 29న విడుదల కానున్న సినిమా గురించి సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల ఇలా తెలిపారు. 
 
మీరు ఎక్కువగా థ్రిల్లర్స్ చేశారు కదా.. బబుల్‌గమ్ లాంటి న్యూ ఏజ్ లవ్ స్టొరీ చేయడం ఎలా అనిపించింది ?
చాలా ఎంజాయ్ చేశాను. నిజానికి ఇలాంటి ప్రేమకథలు, మాస్, కామెడీ, హ్యుమర్ వున్న చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. ‘ఇప్పటివరకూ ఇచ్చింది ఇచ్చేశాను.. ఇకపై నన్ను నేను కొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను’ అని ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాను. అది బబుల్‌గమ్ తో మొదలైయింది.  
 
ఇందులో హీరో డీజే కదా.. అలాంటి మ్యూజిక్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేశారా?  
చిన్నప్పటి నుంచి చాలా ఎలక్ట్రానిక్ మ్యూజిక్ విన్నాను. నేను గిటారిస్ట్ ని. నా ఫ్రెండ్స్ అందరూ దాదాపు డిజేలు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ లోనే చాలా లేయర్స్ వుంటాయి. వాటిపై చిన్నప్పటి నుంచి పరిశీలన వుంది. అయితే ఇప్పుడీ చిత్రంలో అలాంటి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. క్యారెక్టర్ కు తగ్గట్టుగా మ్యూజిక్ చేయడం జరిగింది.
 
ఎలక్ట్రానిక్ మ్యూజిక్ లో లిరిక్స్ ని ఎలివేట్ చేయడం సవాల్ తో కూడుకున్న పని కదా ?
నిజమే. లిరిక్స్  ఎప్పిల్ గా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. రవికాంత్ సింగర్ కూడా. ఇందులో ఈజీ పీజీ పాటని తనే రాశాడు, క్షణంలో తను రాసిన పాటకు ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. తనకీ మ్యూజిక్ వచ్చు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాం.  
 
దర్శకుడు రవికాంత్ గారితో మీకున్న అనుబంధం గురించి ?
రవికాంత్ స్కూల్ డేస్ నుంచి తెలుసు. తన షార్ట్ ఫిలిమ్స్ కి నేనే మ్యూజిక్ చేశాను. క్షణం చేసినప్పుడు తనలో ప్రతిభ మరింతగా తెలిసింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అలాగే మా కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కృష్ణ అండ్ లీలా కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా ఓటీటీ లో విడుదలైనప్పటికీ మ్యూజిక్ కి చాలా పేరొచ్చింది. ఇప్పుడు ‘బబుల్‌గమ్’ లో కూడా అద్భుతమైన మ్యూజిక్ కుదిరింది.
 
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
సత్యభామ కి చేస్తున్నాను. గూఢచారి 2 స్టార్ట్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్ నటుడు మురళీమోహన్ నటనకు గుడ్ బై?