Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబర్ 30న విడుదల అవుతున్న "బ్రహ్మాండనాయక్ సాయి బాబా" చిత్రం

శ్రీ షిర్డి సాయిబాబా మహిమల ఆధారంగా రూపోందుతున్న హిందీ చిత్రం "బ్రహ్మాండనాయక్ సాయిబాబా", ప్రముఖ నటుడు మిలింద్ గునాజీ సాయిబాబా పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని గురు సాయి బాబా ఇంటర్నేషన్ బ్యానర్‌పై సత్యప్

Advertiesment
brahmanda nayaka Sai baba movie
, ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (17:24 IST)
శ్రీ షిర్డి సాయిబాబా మహిమల ఆధారంగా రూపోందుతున్న హిందీ చిత్రం "బ్రహ్మాండనాయక్ సాయిబాబా", ప్రముఖ నటుడు మిలింద్ గునాజీ సాయిబాబా పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని గురు సాయి బాబా ఇంటర్నేషన్ బ్యానర్‌పై సత్యప్రకాష్ దూబే తెరకెక్కిస్తున్నారు.. మిలింద్ గునాజీ, కిరణ్ కుమార్, రాజు ఖేర్, రాజా మురాద్, అనిల్ ధావన్, అనంగ్ దేశాయ్, నిఖిత శర్మ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. నార్సింగ్ యమ్.షిండే నిర్మిస్తున్ప ఈ మూవీ ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్యప్రకాష్ దూబే మాట్లాడుతూ.. సాయిబాబా మీద భక్తితో ఈసినిమాను తీయడానికి ముందుకొచ్చానని అన్నారు. 
 
సాయిబాబా మహిమలను ప్రస్తుతం ఉన్న యువతరానికి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా రూపోందిస్తున్నామని తెలిపారు. ఈచిత్రంలో ప్రముఖ నటుడు మిలింద్ గునాజీ టైటిల్ పాత్రలో నటించారని.. బాబా పాత్రలో ఆయన నటన అద్భుతం అని అన్నారు. ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ లక్ష్మణ్, సుశాంత్ శంకర్, సంజయ్ రాజ్ గౌరీశంకర్ సమకూర్చిన పాటలు చాలా పాపులర్ అయ్యాయని తెలిపారు. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సెప్టెంబరు 30న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 
 
చిత్ర నిర్మాత నార్సింగ్ యమ్.షిండే మాట్లాడుతూ: సాయిబాబా నాకు ఇష్టమైన దైవం. అందుకే సినిమా నిర్మించడానికి ముందుకొచ్చానని అన్నారు. బాబా పాత్రలో మిలింద్ పనాజీ బాగా నటించారు. ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందరికి నచ్చే విధంగా నిర్మించామని అన్నారు. గ్రాఫిక్స్ కూడా బాగా వచ్చాయని, ఈ నెల 30న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ "కాటమరాయుడు" నుంచి మరొకరు ఔట్... షూటింగ్ పూర్తయ్యేనా?