Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈనెల 20న వస్తున్న "బొంబాయి మిఠాయి"

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న "బొంబాయి మిఠాయి" ఈనెల (జనవరి) 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కన్నడలో ఘన విజయం సాధించిన "బొంబాయి మిఠాయి" చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అ

ఈనెల 20న వస్తున్న
, బుధవారం, 18 జనవరి 2017 (17:19 IST)
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న "బొంబాయి మిఠాయి" ఈనెల (జనవరి) 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కన్నడలో ఘన విజయం సాధించిన "బొంబాయి మిఠాయి" చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించారాయన. దిశా పాండే, విక్రమ్, నిరంజన్ దేశ్ పాండే, బులెట్ ప్రకాష్, కిషోర్ బల్లా ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకుడు. 
 
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించిందని.. తెలుగులోనూ మంచి విజయం సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. పెద్ద సినిమాలేవీ ఈవారం విడుదల కాకపోతుండడం "బొంబాయి మిఠాయి"కి లాభించనుందని ఆయన అన్నారు. కృష్ణతేజ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి పాటలు పోతుల రవికిరణ్, సంగీతం: వీర సమరత్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: చంద్రమోహన్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికుల రోజుకు ముందుగానే నితిన్ వివాహం.. రుక్మిణి మెడలో మూడుముళ్లు వేయనున్నాడోచ్!