Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్.. బంగారు కోడిపెట్ట టాస్క్.. సన్నీ Vs ప్రియా..

Advertiesment
బిగ్ బాస్.. బంగారు కోడిపెట్ట టాస్క్.. సన్నీ Vs ప్రియా..
, బుధవారం, 20 అక్టోబరు 2021 (17:23 IST)
sunny_priya
బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. రోజురోజుకు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ లకు బంగారు కోడిపెట్ట టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ప్రభావతి అనే కోడి కూత పెట్టి పెట్టే గుడ్లను హౌ సభ్యులు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు గుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఎవరైతే గుడ్లను సంపాదించి ఉంటారో ఆ గుడ్లపై వారి ఫేస్ స్టికర్ అతికించాలి.
 
ఈ టాస్క్ లో భాగంగా ముందుగానే కంటెస్టెంట్ ప్రియా గుడ్లను దొంగతనం చేస్తానని ప్రకటించింది. ఈ క్రమంలోనే సన్నీ బుట్టలో ఉన్నటువంటి గుడ్లను సమయం చూసి ప్రియ మాయం చేసింది. ఇలా ప్రియ తన గుడ్లను దొంగలించడంతో తన పడిన కష్టం మొత్తం వృధా అయ్యిందని సన్ని బాధపడిన తన జోలికి వస్తే ఊరుకోను అని తెలిపారు. సన్నీ మాటలకు ప్రియ సమాధానం చెబుతూ తానే సన్ని గుడ్లను దొంగతనం చేశానని చెప్పింది. ఆ సమయంలో గేమ్ ఆడడం చేత కాకపోతే ఒక మూలన కూర్చోవాలి అంటూ సన్నీ మాట్లాడటంతో ప్రియా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ప్రియా సన్నీల మధ్య గొడవ పెద్దఎత్తున చోటుచేసుకుంది. ప్రియా సన్నీ బుట్ట దగ్గరకు రావడంతో అది గమనించిన సన్నీ వెంటనే తనను పక్కకు తోసాడు. దీంతో ఆమె తనపై చేయి చేసుకోబోయింది. అంతే కాకుండా ఆమె తనకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరి గొడవను ఆపడానికి ఇంటి సభ్యులు ప్రయత్నించినప్పటికీ వారి వల్ల కాలేదు. మరి నేటి ఎపిసోడ్లో వీరి మధ్య ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రెండు ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా