Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ షోలో ప్రత్యక్ష నరకం చూస్తున్న ఒకే ఒక వ్యక్తి.. ఎవరో తెలుసా?

బిగ్ బాస్ ఇల్లు జైలులా ఉండొచ్చుగానీ… లోపల ఉండే వాళ్లుకు సదుపాయాలు మాత్రం స్టార్ హోటల్ కంటే మిన్నగా ఉంటాయి. ఆహారానికీ కొదవ వుండదు. అయినా నూతన్ నాయుడు అనే ఇంటి సభ్యుడు పస్తు పడుకున్నారు. సామాన్యుల కేటగిరిలో బిగ్ బాస్ షోకి సెలక్ట్ అయిన నూతన్ నాయుడు తొలి

Advertiesment
బిగ్ బాస్ షోలో ప్రత్యక్ష నరకం చూస్తున్న ఒకే ఒక వ్యక్తి.. ఎవరో తెలుసా?
, శుక్రవారం, 15 జూన్ 2018 (20:22 IST)
బిగ్ బాస్ ఇల్లు జైలులా ఉండొచ్చుగానీ… లోపల ఉండే వాళ్లుకు సదుపాయాలు మాత్రం స్టార్ హోటల్ కంటే మిన్నగా ఉంటాయి. ఆహారానికీ కొదవ వుండదు. అయినా నూతన్ నాయుడు అనే ఇంటి సభ్యుడు పస్తు పడుకున్నారు. సామాన్యుల కేటగిరిలో బిగ్ బాస్ షోకి సెలక్ట్ అయిన నూతన్ నాయుడు తొలి రోజు నుంచి కాస్త భిన్నంగా కనిపిస్తున్నారు. తాను అందరికంటే భిన్నం అని భావిస్తున్నట్లు కనిపిస్తున్న నూతన్ నాయుడు… తను ధరించే దుస్తులు, బూట్లు నుంచి టవల్ దాకా అన్నింటిపైనా ఎన్.ఎన్. అని రాసుకున్నారు. ఎన్ ఎన్ అంటే నూతన్ నాయుడు. 
 
ఈ విషయాన్ని తొలి రోజు నానీకి చెప్పారు కూడా. బిగ్ బాస్ ఇంట్లో ఆయన మాటలు, చేష్టలు అన్నీ కాస్త నాటకీయంగా ఉంటున్నాయి. తాను షో గెలవడమే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నట్లు బహిరంగంగా చెబుతున్నారు. నూతన్ నాయుడి ధోరణిపై ఇంటిలోని దాదాపు అందరు సభ్యులు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రతి విషయానికీ ఉపన్యాస పద్ధతిలో వివరణలు ఇచ్చేందుకు ప్రయత్నించడమే సభ్యుల అసహనానికి కారణం. ఇదే మాటను సభ్యులు కిరీటి, తనీష్, తేజ తదితరులు ముఖంపైనే చెప్పేశారు కూడా. దీంతో అలిగిన నూతన్ నాయుడు నాల్గోరోజు రాత్రి భోజనం చేయకుండానే పడుకున్నారు. కిరీటి, తేజ వెళ్లి బ్రతిమలాడినా… తనకు‌ ఆహారం జీర్ణం కాలేదని చెప్పి భోజనం చేయకుండానే నిద్రపోయారు.
 
నూతన్ నాయుడు ధోరణి నుంచి అర్థమయ్యేది ఏమంటే…. ఆధిపత్య ధోరణి మంచిది కాదని, అన్నీ తనకే తెలుసనుకునే పద్ధతి వల్ల అందరూ దూరమైపోతారని. ఇది ఒక వ్యక్తిత్వ వికాస సూత్రం కూడా. ఆధిపత్యాన్ని ఎవరూ కోరుకోరు. కలుపుగోలుతనమే అందరికీ దగ్గర చేస్తుంది. నాల్గోరోజు కూడా షో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బోర్‌గానూ అనిపించింది. శనివారం నానీ వచ్చాక ఏమైనా షో ఆసక్తికరంగా మారుతుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్... ఇతను షో అంతా నాశనం చేస్తున్నాడు... ప్లీజ్ ఎలిమినేట్ హిమ్