Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

ఎన్టీఆర్ బాగా ముదిరిపోయాడు... ఇక 'బిగ్ బాస్' పిచ్చి పీక్స్‌కే...

బిగ్ బాస్ తెలుగు షోను జూనియర్ ఎన్టీఆర్ మెల్లమెల్లగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఒకవైపు తమిళ బిగ్ బాస్ క్రమంగా కళ తప్పి చతికిలపడిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళ బిగ్ బాస్ చూసేవారు సైతం తెలుగులో జూ.ఎన్టీఆర్ షోను భలేగా నడి

Advertiesment
BigBoss Telugu
, సోమవారం, 21 ఆగస్టు 2017 (19:09 IST)
బిగ్ బాస్ తెలుగు షోను జూనియర్ ఎన్టీఆర్ మెల్లమెల్లగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఒకవైపు తమిళ బిగ్ బాస్ క్రమంగా కళ తప్పి చతికిలపడిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళ బిగ్ బాస్ చూసేవారు సైతం తెలుగులో జూ.ఎన్టీఆర్ షోను భలేగా నడిపిస్తున్నారంటూ కితాబిస్తున్నారు. 
 
ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ షో టైంలో చెలరేగిపోతున్నాడు. మొదట్లో ఏవో స్టార్ మా వాళ్లు ఇచ్చిన డైలాగులు ఏమయినా బట్టీపట్టి చెప్పేస్తున్నాడా అని కొందరు అనుకున్నారు కానీ ఇప్పుడు బాగా ముదిరిపోయాడంటున్నారు. బిగ్ బాస్ హౌసులో వున్నవారిని ఓ ఆట ఆడిస్తున్నారు. హీరో నవదీప్‌కు నిన్న చమట్లు పట్టించాడు ఎన్టీఆర్. 
 
మీ ఇంట్లో జరిగిన రైడ్‌లో పాత 500, 1000 నోట్లు దొరికాయట. నీ మూటాముల్లె సర్దుకో. నిన్ను విచారించేందుకు రమ్మంటున్నారు అనగానే నవదీప్ కూడా మెల్లగా బట్టలు సర్దుకోబోయాడు. అంతలోనే... అదంతా జస్ట్ జోక్ అంటూ తేల్చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మొత్తమ్మీద జూనియర్ ఎన్టీర్ వ్యాఖ్యానం లవ్లీగా వుంటుందనే టాక్ వచ్చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''అర్జున్ రెడ్డి'' లిప్ లాక్ పోస్టర్.. చించేసిన వీహెచ్.. తాతయ్యా ''చిల్'' అంటూ ఎమోజీ.. (ఫోటోలు-ట్రైలర్)