ప్రభాస్ తాజా సినిమా ప్రాజెక్ట్ కె. చితర్ర కోసం పెద్ద నిర్మాతలు సిండికేట్ అయ్యారు. గతంలో దిల్‌రాజు మానియా వుండేది. ఈసారి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్‌బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ అగర్వాల్ ఏకం అయ్యారు. వీరు ప్రాజెక్ట్ కె. నైజాం హక్కులను 70కోట్లకు స్వంతం చేసుకున్నారు.
ఈ గ్లోబల్ సినిమాను ఈ సారి దిల్‌రాజు చేతికి వెళ్ళకుండా చేయడం విశేషం. గతంలో రాజమౌళి స్టామినాతో ప్రభాస్ బాహుబలి మొదటి భాగాన్ని నైజాంలో దిల్‌రాజు 23 కోట్లకు 2015లో స్వంతం చేసుకుని లాభాలుపొందారు. అదే బాహుబలి రెండో భాగాన్ని 2016లో ఏషియాన్ సినిమాస్ 40 కోట్లతో నైజాంలో స్వంతం చేసుకుంది. ఇద్దరికీ మంచి లాభాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత దర్శకుడు సుజిత్ నేతృత్వంలో ప్రభాస్ నటించిన సాహో సినిమాను నైజాంలో 40కోట్లకు కొనుగోలు చేసిన ఏషియన్, ఆ తర్వాత రాథే శ్యామ్ సినిమాను 37 కోట్లకు స్వంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు నిరాశపర్చాయి. కానీ ప్రభాస్ మానియా తగ్గలేదు. తన స్టామినాను ప్రాజెక్ట్ కె.లో మరోసారి నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమా 2024లో విడుదలకాబోతోంది.
అయితే అందుకు కారణం ప్రభాస్ మాత్రమేకాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ కావడం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వంతోపాటు ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీత్ నిర్మాత కావడం వల్లే ఈ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే అశ్వనిదత్‌కు సీతారామమ్ ద్వారా పేరుతోపాటు డబ్బులు కూడా వచ్చాయి. పాన్ ఇండియా నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు