Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ హీరో.. ఓ హీరోయిన్‌ల ప్రేమ కథ... నేడు మూడు ముళ్లబంధంతో ఒక్కటవుతారు...

ఓ అందమైన అబ్బాయి... ఓ అపురూపమైన అమ్మాయి. వీరిద్దరి మతాలు వేరు.. ఇద్దరి భాషలు వేరు.. ఇద్దరి ప్రాంతాలూ వేరు. కానీ... ఇద్దరూ ప్రేమించుకున్నారు! రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు తేదీలు మారేకొద్దీ ఆ బం

Advertiesment
ఓ హీరో.. ఓ హీరోయిన్‌ల ప్రేమ కథ... నేడు మూడు ముళ్లబంధంతో ఒక్కటవుతారు...
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (07:08 IST)
ఓ అందమైన అబ్బాయి... ఓ అపురూపమైన అమ్మాయి. వీరిద్దరి మతాలు వేరు.. ఇద్దరి భాషలు వేరు.. ఇద్దరి ప్రాంతాలూ వేరు. కానీ... ఇద్దరూ ప్రేమించుకున్నారు! రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు తేదీలు మారేకొద్దీ ఆ బంధం బలపడుతూనే ఉంది ఒకరితో ఒకరు.. ఒకరి కోసం ఒకరు అన్నట్టు బతికారు! కలిసి తిరిగారు.. కలలు పంచుకొన్నారు. ఇంట్లో కూడా పచ్చజెండా ఊపేశారు. ఇంకేముంది... ఇక పెళ్లే! ఆ పెళ్లే నేడు జరుగనుంది.
 
ఆ అందమైన అబ్బాయి - అమ్మాయి ఎవరో కాదు.. టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత. వీరి పెళ్లి శుక్రవారం గోవాలో జరుగనుంది. రెండు రోజుల్లో రెండు రకాలుగా పెళ్లి చేసుకోనుండటం ఈ పెళ్లి ప్రత్యేకత. తొలుత చైతూ-సమంత పెళ్లి హిందూ సంప్రదాయ ప్రకారం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గం.లకు సంగీత్‌ మొదలవుతుంది. రాత్రి 11గం 52 నిమిషాలకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఏకం కాబోతున్నారు. 
 
మరుసటి రోజు అంటే... శనివారం సాయింత్రం 5గం 30 నిమిషాలకు గోవా చర్చ్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకోబోతున్నారు. 8వ తేదీన గోవాలోనే భారీ స్థాయిలో వివాహ విందు ఇవ్వబోతోంది అక్కినేని కుటుంబం. ఈ విందుకు తెలుగు, తమిళ చిత్రసీమల నుంచి ప్రముఖులంతా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గోవాలోని ‘డబ్ల్యూ’ హోటెల్‌ ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.
 
అయితే, 'చైతూ సమంతల పెళ్లి చాలా సింపుల్‌గా జరగబోతోంది' అని టాలీవుడ్ మన్మథుడు, నాగ చైతన్య తండ్రి నాగార్జున ముందే చెప్పేశారు. అయితే, ఈ పెళ్లిలో ఆడంబరాలు తక్కువే అయినా - ఆకర్షణలు ఎక్కువగానే కనిపించబోతున్నాయి. దాంతో పాటే కొన్ని స్వీట్‌ షాకింగ్‌ను నాగార్జున ఫ్యామిలీ ఇవ్వనుందట. సాధారణంగా సినిమా వేడుకల్లో టీజర్లు, ట్రైలర్లు కనిపిస్తుంటాయి. ఈ పెళ్లికీ టీజర్‌లాంటిది ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందని తెలుస్తోంది. సమంతని అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఓ వీడియో రూపొందించారట. 
 
నాగార్జున, అమల, అఖిల్‌, వెంకటేష్‌, రానా... ఇలా అక్కినేని - దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఈ వీడియోలో కనిపిస్తారు. వాళ్లంతా తమ కుటుంబంలోకి సమంతని ఆహ్వానిస్తున్నట్టు ఈ వీడియో కట్‌ చేశారట. గోవాలో వివాహ వేడుక సమయంలో ఈ వీడియో ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఈ వీడియో సంగతి చైతూకిగానీ, సమంతకుగానీ తెలియకుండా కుటుంబ సభ్యులు సర్‌ప్రైజ్‌గా ప్లాన్‌ చేసినట్టు ఏఎన్నార్ కుటుంబ వర్గలా సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బా.. మళ్లీ అనుష్కతో స్నేహమేనంటున్న ప్రభాస్..