Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమ్మూ-చైతూ పెళ్ళి ఉత్తుత్తిదేనా..? హనీమూన్‌కు కొత్త సినిమాలకు లింకు లేదా? సమంత ఇలా చెప్పిందేమిటి?

సమంత-నాగచైతన్యల పెళ్ళి వ్యవహారంపై టీవీలు రేటింగ్‌ను బాగా పెంచుకుంటున్నాయి. వెబ్ సైట్లు సైతం వ్యూవ్స్ పెంచుకుంటున్నాయనే చెప్పాలి. సమంత-చైతూల పెళ్లి తంతుపై వెల్లువెత్తిన వార్తలన్నీ అబద్ధాలనే విధంగా సమంత

Advertiesment
Because I want my next movie to be even more special than THERI than 24 than AA..AA.And that's very very difficult
, ఆదివారం, 17 జులై 2016 (15:23 IST)
సమంత-నాగచైతన్యల పెళ్ళి వ్యవహారంపై టీవీలు రేటింగ్‌ను బాగా పెంచుకుంటున్నాయి. వెబ్ సైట్లు సైతం వ్యూవ్స్ పెంచుకుంటున్నాయనే చెప్పాలి. సమంత-చైతూల పెళ్లి తంతుపై వెల్లువెత్తిన వార్తలన్నీ అబద్ధాలనే విధంగా సమంత మాట్లాడటమే ఇందుకు కారణం. సోషల్ మీడియాలో సమ్మూ-చైతూల వివాహంపై ఎలాంటి ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 
సమంతను కోడలిగా చేసుకునేందుకు నాగార్జున ఒప్పుకోలేదని, చైతూ తల్లి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఆ తర్వాత అక్కినేని నాగ్ కూడా ఓకే చెప్పేశాడని వార్తలు రావడంతో ఇక పెళ్లే తరువాయి అన్న చందంగా టాలీవుడ్‌లో చర్చ సాగింది. అయితే ఇవన్నీ ఉత్తుత్తివేనని సమంత ట్విట్టర్లో తేల్చేసింది. ఇంకా కష్టపడకుండా పబ్లిసిటీ వస్తుందంటే వదులుకోవడం ఎందుకన్నట్లు వ్యవహరిస్తోంది. ఇంకా త‌న పెళ్లిపై జ‌రుగుతున్న ప్రచారాన్ని స‌మంత బాగానే ఎంజాయ్ చేస్తున్న‌ట్టుందని సినీ పండితులు అంటున్నారు. 
 
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..? సమంత కొత్త సినిమాలు ఏవీ అంగీకరించడం లేదని... ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒక్క జనతా గ్యారేజ్ సినిమా పూర్తి చేస్తే చాలనట్టుగా వ్యవహరిస్తుంది. దాంతో పెళ్లి చేసుకునే ఆలోచనతోనే సమంత కొత్త సినిమాలని అంగీకరించడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకుంటే.. ఆపై హనీమూన్ వంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కొత్త సినిమాలు ఒప్పుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి అనే ఆమె సినిమాలు ఒప్పుకోవట్లేదని అందరూ చెప్పుకున్నారు. 
 
ఈ వార్తలపై సమంత ఏమాత్రం స్పందించలేదు. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం సమంత-చైతూల పెళ్ళిపై ట్విట్టర్‌లో ఆమె వెంటపడుతున్నారు. ఎట్టకేలకి తాజా సమంత స్పందించి తానూ కొత్తగా చేయబోయే సినిమా అ..ఆ, 24, తెరి సినిమాలకంటే అద్భుతంగా ఉండాలని, అటువంటి కథ దొరకడం కష్టమే అవుతుందని ట్విట్ చేసింది. అందుకే కొత్త సినిమాల జోలికి వెళ్ళలేదన్నట్లు చెప్పుకొచ్చింది. 
 
ఇదిలా ఉంటే.. దక్షిణాది అగ్రతారగా వెలుగొందుతున్న సమంత చదువులోనూ ఫస్టేనని నిరూపించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఈ భామ ఫస్ట్ క్లాస్‌లోనే పాసయ్లిందనేందుకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రతిక్లాస్‌లో టాపర్‌గా నిలిచానని, అందుకు సాక్ష్యాలివిగో....అంటూ తన సర్టిఫికెట్స్‌ను పోస్టు చేసింది. పదో తరగతి లెక్కల సబ్జెక్ట్‌లో వందకు వంద మార్కులు సాధించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి 2: తమిళ రైట్స్ వామ్మో రూ.54కోట్లా.. షాకవుతున్న డిస్ట్రిబ్యూటర్లు!!