Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లెట్‌పై బాలయ్య... హిందూపురమంతా సందడే సందడి.. ఫ్యాన్స్ కేరింతలు

సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఉన్న అభిమాన గణం.. ఆయనకు ఉన్న క్రేజు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు - రాజకీయాలు రెండు పడవలపై ఆయన ప్రయాణిస్తున్నా జోరు మాత్రం తగ్గలేదు. హిందూపురం

Advertiesment
balakrishna
, శనివారం, 22 అక్టోబరు 2016 (13:24 IST)
సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఉన్న అభిమాన గణం.. ఆయనకు ఉన్న క్రేజు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు - రాజకీయాలు రెండు పడవలపై ఆయన ప్రయాణిస్తున్నా జోరు మాత్రం తగ్గలేదు. హిందూపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్న బాలయ్య అనంతపురంలో సందడి చేశారు. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. యన్‌బికే హెల్పింగ్ హెండ్స్ అధినేత జగన్ ఇంటికి వెళ్లి వారితో సరదాగా కాసేపు గడిపారు. ఈ సందర్భంగా బాలయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
 
బాలయ్య తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బ్యానర్లతో అభిమానులు తమ హీరోకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పాండురంగ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ మున్సిపల్‌ పార్క్‌ను బాలయ్య ప్రారంభించారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. 
 
అనంతరం కెరికెర బసవనపల్లిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.39 లక్షలతో నిర్మించిన నూతన భవనాలను బాలకృష్ణ ప్రారంభించారు. అంతకుముందు బాలయ్య ఆటోనగర్‌ నుంచి బైక్‌ ర్యాలీతో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య స్వయంగా బుల్లెట్‌ నడుపుతూ వెళ్లారు. బాలయ్య బుల్లెట్ ఎక్కడంతో అక్కడి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు కేరింతలు కొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ 'డార్లింగ్'.. బాలీవుడ్ 'బాహుబలి'... ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబరు 23... స్పెషల్ ఆర్టికల్