ఆహా! ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద పలు రకాలుగా షోలు నిర్వహిస్తున్నట్లే బాలకృష్ణతో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కి బ్రేక్ పడింది. అన్ స్టాపబుల్ అంటే ఎవరూ ఆపలేరనేట్లుగా టైటిల్ పెట్టినా ఎట్టకేలకు ఎక్కడోచోట ముగింపు పలకాల్సివచ్చింది. అయితే ఇది మొత్తంగా కాదు. ఈ సీజన్ వరకే అని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.
బాలకృష్ణ మొదటి సారి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ముగియడానికి సిద్దం గా ఉంది. అందుకు మహేష్‌బాబు ఎపిసోడ్ కావడం విశేషం. ఇటీవలే రాజమౌళితో బాలకృష్ణ ఎపిసోడ్ చేశారు. అది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.
బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేదిక పై కలిసి ఉన్న పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ ఎపిసొడ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని ఆహా వీడియో తెలిపింది.