Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక రోజు క్లిక్కుల్లో ప్రపంచంలో 11వ స్థానంలో నిలిచిన “బాహుబలి 2” ట్రైలర్! యూట్యూబ్‌లో 7వ స్థానం

తెలుగు సినిమా సరిహద్దుల్ని చెరిపివేసిన బాహుబలి సినిమా భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత విజయం నమోదు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఒక రోజు క్లిక్స్ విషయంలో బాహుబలి రికార్డుకు దరిదాపుగా వచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే షారుక్ ఖాన్ రాయీస్ ట్రైలర్‌నే చూపాలి.

ఒక రోజు క్లిక్కుల్లో ప్రపంచంలో 11వ స్థానంలో నిలిచిన “బాహుబలి 2” ట్రైలర్! యూట్యూబ్‌లో 7వ స్థానం
హైదరాబాద్ , శనివారం, 18 మార్చి 2017 (05:05 IST)
తెలుగు సినిమా సరిహద్దుల్ని చెరిపివేసిన బాహుబలి సినిమా భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత విజయం నమోదు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఒక రోజు క్లిక్స్ విషయంలో బాహుబలి రికార్డుకు దరిదాపుగా వచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే షారుక్ ఖాన్ రాయీస్ ట్రైలర్‌నే చూపాలి. కొన్ని నెలల క్రితం విడుదలైన రాయీస్ ఒక రోజులో 20 మిలియన్ ట్రయిలర్ హిట్లను సాదించి ప్రపంచ సినిమాల్లోనే 19వ స్థానం సాధించగా, బాహుబలి 2 ట్రయిలర్ ఒకరోజులో 5 కోట్ల హిట్లను (50 మిలియన్లు) సాధించింది 11వ స్థానంలో నిలిచింది. సమీప భవిష్యత్తులో ఈ రికార్డును ఛేదించే మొనగాడు సినిమా ఉండదనే సినీ పండితులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
 
తొలి 24 గంటల్లో యూ ట్యూబ్ ను ఓ కుదుపు కుదిపి సరికొత్త రికార్డులను సృష్టించిన “బాహుబలి 2” ఇండియన్ సినిమాలలో అగ్ర స్థానంలో నిలిచింది. మరి ఇంతటి ప్రభంజనం సృష్టించిన ఈ ట్రైలర్ ప్రపంచ సినిమాలతో పోటీపడే స్థాయిలో ఉందా? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం లభిస్తోంది. తొలి 24 గంటల్లో ప్రపంచంలోని అత్యధిక క్లిక్స్ అందుకున్న ట్రైలర్ల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఈ జాబితాలో “బాహుబలి 2” ఏకంగా టాప్ 11 స్థానాన్ని ఆక్రమించడం విశేషం. తొలి 10 స్థానాలలో హాలీవుడ్ సినిమాలు నిలువగా, ఆ తర్వాత 11వ స్థానంలో 50 మిలియన్ (నాలుగు భాషలలో 5 కోట్ల క్లిక్స్) అందుకుని “బాహుబలి 2” సత్తా చాటింది. ఇలాంటి అరుదైన ఫీట్ ను అందుకోవడం నిజంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా చెప్పాలి. 
 
ఒక్క తెలుగు భాషకు సంబంధించే ఈ రికార్డు సాధించకపోయినా, “బాహుబలి” సృష్టికర్త మన తెలుగు వారే కదా! భవిష్యత్తులో తెలుగు సినిమాకు మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయన్న సంకేతాలు కనపడుతున్నాయి.
 
ఇక యూట్యూబ్ విషయానికి వస్తే బాహుబలి2 దిగ్భ్రాంతి పరుస్తోంది. 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగానే అత్యధికంగా వీక్షించిన ట్రయిలర్లలో బాబుబలి2-  మొత్తంమీద 7వ స్థానం సంపాదించింది. తెలుగులో, బాలివుడ్‌లో, యూట్యూబ్‌లో ఈ సంచలన విజయం చిత్ర దర్శకుడు రాజమౌళి, ఆయన టీమ్‌ని ఉబ్బితబ్బిబ్బయేలా చేస్తోంది. కొన్ని రికార్డులను ఛేదించవచ్చని వారనుకున్నారు కాని చలనచిత్ర రికార్డులను తుడిచిపెట్టే స్థాయి సినిమా తమ కళ్లముందు, తమ చేతులతో నిర్మించబడిందన్న భావన వారిని పరవశింపచేస్తోంది. మరోవైపు బాహుబలి ప్రతిధ్వని దేశమంతటా ఇంకా వినిపిస్తూనే ఉంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కట్టప్ప నిజంగా బాహుబలిని చంపలేదా? తల పట్టుకుంటున్న బాహుబలి అబిమానులు