Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబైలో కనీ వినీ ఎరుగని రీతిలో బాహుబలి-2 గ్రాండ్ ప్రీమియర్: బాలివుడ్ మొత్తాన్ని రప్పిస్తున్న కరణ్ జోహార్

దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్ అయిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాను ప్రపంచంలోనే మొదటిసారిగా చూసే అవకాశాన్ని బాలీవుడ్ దక్కించుకుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ప్రముఖ హింద

Advertiesment
Bahubali 2
హైదరాబాద్ , శనివారం, 22 ఏప్రియల్ 2017 (09:08 IST)
దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్ అయిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాను ప్రపంచంలోనే మొదటిసారిగా చూసే అవకాశాన్ని బాలీవుడ్ దక్కించుకుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ బాహుబలి2 ప్రీమియర్‌ని ఏప్రిల్ 27నే ప్రదర్శించనున్నారు. బాలివుడ్ ప్రముఖులను అందరినీ ఈ మెగా ప్రీమియంకు ఆహ్వానించనున్నట్లు సమాచారం.
 
ఆర్కా ఫిలింస్, ధర్మా ప్రొడక్షన్స్ కలిసి హిందీ ప్రాంతంలో మార్కెట్ చేసిన బాహుబలి ది బిగినింగ్ సాధారణ శ్రోతలను, విమర్శకులను కూడా అలరించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు బాహుబలి రెండో భాగం కూడా చరిత్రలోనే అతిపెద్ద ప్రీమయర్‌గా మిగిలిపోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలీవుడ్ చిత్రరంగంలోనే ప్రముఖులు మొత్తంగా ఏప్రిల్ 27న బాంబేలో ప్రదర్శించబడనున్న తొలి ప్రీమియర్‌కి తరలి రానున్నారని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన అంతర్దాతీయ చిత్ర ప్రీమియర్లంత భారీగా దీన్ని నిర్వహించనున్నారు.
 
బాలీవుడ్‌లో అందరికీ సుపరిచితుడైన కరణ్ జోహార్ బాలీవుడ్ ప్రముఖులందరి సమక్షంలో తానూ బాహుబలి2 ని తిలకించనున్నారు. ఇక బాహుబలి 2 ప్రీమియం పండగ వాతావరణాన్ని సృష్టించనుంది. ఆహ్వానించబడిన అతిధులందరూ ఈ గొప్ప ఈవెంటును చిరస్మణీయ జ్ఞాపికగా స్వీకరించనున్నారు. 
 
టీమ్ బాహుబలి రెండో భాగాన్ని భవిష్యత్తు భారతీయ ప్రీమియర్లకు ఒక బెంచ్ మార్క్‌లాగా చేయాలని కృషి చేస్తున్నారు. ఈ ప్రీమియం విడుదల సందర్భంగా అతిధులకు క్లాసిక్ రెడ్ కార్పెట్ పరచనున్నారని తెలుస్తోంది.
 
ఏప్రిల్ 27 సాయంత్రం బాంబేలో జరగనున్న ప్రీమియంకి గానూ  బాహుబలి చిత్రం సెట్‌లలో తీసిన భారీ చిత్తరువులను, ఆర్ట్ వర్క్‌ని వెన్యూలో అలంకరించనున్నారు. దీంతో ప్రీమియర్ వేదికకు లార్జర్ దేన్ లైఫ్ అనుభూతిని కలిగిస్తూ అలంకరించనున్నారు. బాంబే ప్రీమియర్‌లో కూడా ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ప్రదర్శించనున్నారు.
 
బాహుబలి సినిమాలో నటించిన నటీనటులు, తెర వెనుక సిబ్బంది, జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు రాజమౌళి కూడా బాంబేలో ఏప్రిల్ 27న ప్రదర్శించనున్న మెగా ప్రీమియర్‌కి హాజరవనున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో ‘బాహుబలి 2’ సినిమాపై అడ్డంకులకు ఇదా కారణం?