Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ 28న బాహుబలి విడుదల : 36 స్టూడియోలలో గ్రాఫిక్స్ వర్క్

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న బాహుబలి చిత్రం రెండో భాగం విడుదల తేదీని (ఏప్రిల్ 28) ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలుస్తున్న గ్రాఫిక్స్ వర్క్‌ను ప్రపంచ వ్యాప్తంగా 36 ప్రముఖ స్టూడియో

Advertiesment
Bahubali 2
హైదరాబాద్ , సోమవారం, 30 జనవరి 2017 (03:47 IST)
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న బాహుబలి చిత్రం రెండో భాగం విడుదల తేదీని (ఏప్రిల్ 28)  ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలుస్తున్న గ్రాఫిక్స్ వర్క్‌ను ప్రపంచ వ్యాప్తంగా 36 ప్రముఖ స్టూడియోలలో తీస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకబికిన జరుగుతున్నాయి. 
 
గ్రాఫిక్ వర్క్ సినిమాకి గుండెకాయ కావడంతో ప్రపంచవ్యాప్తంగా 36 స్టూడియోలు అవిశ్రాంతంగా ఇందుకోసం తలమునకలవుతున్నట్టు ఈ సినిమాకి పనిచేస్తున్న చీఫ్ వీఎఫ్ఎక్స్ ఇన్‌చార్జి ఆర్సీ కమల్ కన్నన్ తెలిపారు. మూవీ గ్రాఫిక్ వర్క్ అప్‌డేటింగ్ విషయాలను ఆయన వివరిస్తూ, సినిమా విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని గడువులోగా పని ముగించేందుకు ప్రపంచంలోని పేరెన్నిక గన్న స్టూడియోస్‌ వర్క్‌లో ఇన్‌వాల్వ్ అయినట్టు తెలిపారు. 
 
'బాహుబలి' (ది బిగినింగ్) సస్పెన్స్‌తో ముగించడం...ఈ సస్పెన్స్‌కు బాహుబలి-2 (ది కంక్లూజన్)తో తెరదించనుండటంతో సహజంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, 'బాహుబలి-2' చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి మూడోవారంలో విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ తేదీని కూడా ఫిబ్రవరిలోనే ప్రకటించనున్నారు. 
 
హాట్ కేకుల్లా రైట్స్ ఎగరేసుకుపోతున్న పంపిణీ సంస్థలు
భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చారిత్రక చిత్రం 'బాహుబలి-2' ఇటు పబ్లిసిటీలోనే కాదు, మార్కెటింగ్ పరంగానూ సంచలనాలకు కేంద్ర బిందువవుతోంది. ఈ చిత్రం తమిళ రైట్స్‌ పెద్దమొత్తానికి అమ్ముడుపోయినట్టు సమాచారం. థియేటర్ రిలీజ్ హక్కులను శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ హౌస్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ వర్గాల భోగట్టా. 
 
'బాహుబలి-2' హిందీ శాటిలైట్ హక్కులను 'సోనీ నెట్ వర్క్' ఎగురేసుకుపోయింది. ఇందుకు గాను నిర్మాతలకు రూ.51 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక డబ్బింగ్ చిత్రానికి, అందులోనూ ఓ ప్రాంతీయ చిత్రాన్ని టీవీల్లో ప్రసారం చేసేందుకు ఇంతవరకూ ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే ప్రథమమని బాలీవుడ్ వర్గాల భోగట్టా. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానాకు దొరికిన లక్కీ చాన్స్ : ఘాజీ ది ఎటాక్