Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడల్ట్ చిత్రం 'హంటర్‌'లో నటించనున్న అవసరాల శ్రీనివాస్

Advertiesment
Avasarala Srinivas is acting in Hunter remake
, బుధవారం, 11 మే 2016 (15:50 IST)
అవసరాల శ్రీనివాస్ తెలుగు పరిశ్రమకు కమీడియన్‌గా పరిచయమై ఆ తర్వాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకునిగా మారి తొలి చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్, నాగ శౌర్యలు హీరోలుగా 'జ్యో అచ్యుతానంద" అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఒక పక్క దర్శకుడిగా రాణిస్తూనే మరో పక్క కమీడియన్, హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. 
 
ఇటీవలే 'నాన్నకు ప్రేమతో' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ తాజాగా హీరోగా ఓ రీమేక్ చిత్రం చేయబోతున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే ఆ మధ్య బాలీవుడ్‌లో అడల్ట్‌ చిత్రంగా రిలీజైన 'హంటర్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని దర్శకుడు నవీన్‌ మేడారం భావిస్తున్నాడట. 
 
ఈ కథ సారాంశం ఏంటంటే చిన్న వయసు నుండే సెక్స్‌ని అమితంగా ఇష్టపడే ఓ కుర్రాడు, వయసుతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటూ, సెక్స్‌ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటించబోతున్నాడు. నైజాంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూట్ సంస్థ అయిన అభిషేక్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కామెడీ పాత్రల్లో మెప్పించిన శ్రీనివాస్‌ ఇప్పుడు సెక్స్‌ సైకోగా కనిపించనున్నాడు. మరి ఈ పాత్రతో ప్రేక్షకులని ఎలా మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్మి నాజూకైంది.. చీరకట్టులో అదిరిపోయింది.. ఎవరికోసం?