Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Jabardasth Ram Prasad: జబర్దస్త్ ఆటో రాంప్రసాద్‌‌కు యాక్సిడెంట్.. ఏమైందంటే?

Ram prasad

సెల్వి

, గురువారం, 5 డిశెంబరు 2024 (19:23 IST)
Ram prasad
జబర్దస్త్ ఆటో రాంప్రసాద్‌ గురువారం తుక్కుగూడ వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.  ఆటో రాంప్రసాద్ ఎప్పటిలాగే షూటింగ్‌కి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. 
 
ఆయన వెళుతున్నప్పుడు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో జబర్దస్త్ కమెడియన్ తన కారు బ్రేక్ వేసాడు. అప్పుడు తన కారును వెనక నుంచి ఆటో ఢీ కొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కి‌ పలు చిన్న చిన్న గాయాలు అయ్యాయట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంధ్య థియేటర్, అల్లు అర్జున్ టీమ్ పై పోలీసులు కేసు నమోదు.