Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అశోక్ గల్లా తెరంగేట్రం, టాలీవుడ్ స్టార్స్ హాజరు

అశోక్ గల్లా తెరంగేట్రం, టాలీవుడ్ స్టార్స్ హాజరు
, మంగళవారం, 12 నవంబరు 2019 (18:14 IST)
మ‌హేష్ మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ ప్రారంభమైంది. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా తొలి చిత్రం సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, రానా ద‌గ్గుబాటి, హీరో సుధీర్ బాబు, ఆది శేషగిరిరావు, పార్లమెంట్ స‌భ్యులు రామ్మోహ‌న్ నాయుడు, కేశినేని నాని, న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, అమ‌ల అక్కినేని, న‌మ్ర‌త శిరోద్క‌ర్, సుశాంత్, త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 
సినిమా ముహూర్తపు స‌న్నివేశానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క్లాప్ ఇవ్వ‌గా రానా ద‌గ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, గ‌ల్లా అరుణ‌కుమారి, ప‌ద్మావ‌తి గ‌ల్లా, జ‌య‌దేవ్ గ‌ల్లా స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య‌కు అందించారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీని అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లోగోను ఆవిష్క‌రించారు. 
 
నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా… మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అశోక్ గ‌ల్లాకు ఆల్ ది బెస్ట్‌. గల్లా జ‌య‌దేవ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. న‌న్ను సోద‌రుడిలా ట్రీట్ చేస్తుంటారు. ఆయ‌న నిర్మాత‌గా అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. ప‌ద్మావ‌తిగారికి, అశోక్‌కి, హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌ తెలువుతున్నాను అన్నారు.
 
హీరో రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ.. అశోక్ గ‌ల్లాకి ఆల్ ది వెరీ బెస్ట్, మంచి కథ, కథనాలతో ఇండ‌స్ట్రీలోకి పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. నిర్మాత‌గా ప‌ద్మగారు లెగ‌సీని కంటిన్యూ చేస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్‌ తెలువుతున్నాను అన్నారు. 
 
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ… హీరో అశోక్ గల్లాకు ఆల్ ది బెస్ట్‌. చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వ‌చ్చినా సరే గ్రౌండ్ లెవ‌ల్లో వ‌ర్క్ చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాల్లోకి రాకముందు తాను ఎంతో హోమ్ వర్క్ చేసాడు, క‌చ్చితంగా త‌ను స‌క్సెస్ సాధిస్తాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య స‌హా ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు” అన్నారు.
 
న‌టుడు వి.కె. న‌రేష్ మాట్లాడుతూ.. ముందుగా హీరో అశోక్‌ గల్లాకు అభినంద‌నలు. త‌న‌కు అభిమానులు, ఇండ‌స్ట్రీ స‌హా అంద‌రి ఆశీర్వాదాలు ఉండాల‌ని కోరుకుంటున్నాను. క‌థ విన్నాను. రాకింగ్ స‌బ్జెక్ట్‌. యూత్ స‌హా అంద‌రికీ న‌చ్చే ఎంట‌ర్‌టైన‌ర్‌ సబ్జెక్ట్ ఇది. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు రాని న్యూ జోన‌ర్ మూవీ. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నాడు, తనకు తన యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 
 
గ‌ల్లా అరుణ కుమారి మాట్లాడుతూ.. మా మ‌న‌వ‌డు అశోక్ హీరోగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తుండ‌టం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. మా నాన్న‌గారి ఆశీర్వాదం అశోక్‌కి ఉంటుంది. త‌ను ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని చాలా బ‌లంగా అనుకుని హార్డ్ వ‌ర్క్ చేసి ఎంట్రీ ఇస్తున్నాడు. త‌ను మంచి హీరోగా పేరు తెచ్చుకుని స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
 
పార్ల‌మెంట్ స‌భ్యుడు రామ్మోహ‌న్ నాయుడు మాట్లాడుతూ.. అశోక్‌కి కంగ్రాట్స్‌. ఫ్యూచ‌ర్‌లో మంచి యాక్ట‌ర్ అవుతాడ‌ని న‌మ్ముతున్నాను. మంచి విలువలు, క‌మిట్ మెంట్ ఉన్న కుటుంబం నీకు అండ‌గా ఉంది. అంద‌రి పేరు నువ్వు నిల‌బ‌డ‌తాన‌ని కోరుకుంటున్నాను. కంటెంట్ బేస్డ్ మూవీస్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ప‌ద్మక్కగారి లెగ‌సీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను. జ‌య‌న్న‌కి థ్యాంక్స్‌ అన్నారు.
webdunia
 
హీరో సుశాంత్ మాట్లాడుతూ.. అశోక్‌కి అభినంద‌న‌లు. శ్రీరామ్ ఆదిత్య‌కి, నిధి అగ‌ర్వాల్‌కి ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు. కుటుంబం నుండి ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ ఉన్నారు. ఆ లెగ‌సీని అశోక్‌ కంటిన్యూ చేస్తాడ‌ని భావిస్తున్నాను అన్నారు.
 
డా.ర‌మాదేవి మాట్లాడుతూ.. `సాధార‌ణంగా ఇండ‌స్ట్రీలోకి డ‌బ్బులు సంపాదించాలని వ‌స్తుంటారు. కానీ డ‌బ్బులున్నా కూడా క‌ళ‌పై మ‌క్కువ‌తో అశోక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. త‌నకి చిన్న‌ప్ప‌టి నుండి సినిమాలంటే ఎంతో ఇష్టం. కార్టూన్స్ చూడ‌కుండా అల్లూరి సీతారామ‌రాజు సినిమా చూసేవాడు. న‌ట‌న‌పై ప్యాష‌న్‌తో వ‌స్తున్న అశోక్‌ని అంద‌రూ ఆశీర్వ‌దించాలి“ అన్నారు.
 
పార్ల‌మెంట్ స‌భ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ.. రాజ్‌గోపాల్ నాయుడుగారి మునివ‌డు అశోక్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నందుకు త‌న‌కు అభినంద‌న‌లు. గొప్ప రాజ‌కీయ నాయ‌కుడిగా చిత్తూరుజిల్లాకు ఎంతో సేవ చేశారు. త‌ర్వాత మా అరుణ‌క్క‌, రామ‌చంద్ర‌నాయుడుగారు ఓ ఇండ‌స్ట్రీని స్థాపించి వేల మందికి జీవ‌నోపాధిని క‌ల్పించారు. అలాగే కృష్ణ‌గారి మ‌న‌వ‌డు. మ‌హేష్‌బాబుగారి మేన‌ల్లుడు.. నా స్నేహితుడు జ‌య‌దేవ్ త‌న‌యుడైన అశోక్ తాత‌గారిలా, తండ్రిగారిలా, కృష్ణ‌గారిలా, మహేష్‌బాబుగారిలా గొప్ప‌గా పేరు తెచ్చుకుంటాడ‌ని కోరుకుంటున్నాను అన్నారు.
 
యాక్టింగ్ గురు స‌త్యానంద్ మాట్లాడుతూ.. అశోక్ ఎంట్రీ కోసం ఆస‌క్తిగా ఎదురు చూసిన వారిలో నేను ఒక‌డిని. అశోక్ ఓ సాధార‌ణ స్టూడెంట్‌లా క‌ష్ట‌ప‌డ్డారు. ఎంతో మంది నటులకు నేను శిక్షణ ఇచ్చారు. అశోక్ మంచి నటుడు అవుతాడు, తనలో కష్టపడే తత్వం ఉంది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడాని భవిస్తూ చిత్ర యూనిట్ అంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు.
 
పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా మాట్లాడుతూ.. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌ను చాలా రోజుల క్రిత‌మే రిజిష్ట‌ర్ చేశాం. కేవ‌లం సినిమాలే కాదు.. టెలివిజ‌న్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాల‌ని మేం భావిస్తున్నాం. అలాగే నా భార్య ప‌ద్మావ‌తి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారి ఫ్యామిలీకి చెందిన‌వార‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హీరోగానే కాదు.. డైరెక్ట‌ర్‌గా, నిర్మాత‌గా, స్టూడియో అధినేత‌గా త‌న మార్కును క్రియేట్ చేశారు. 
 
ఇప్పుడు మా ఫ్యామిలీ నుండి అశోక్ గ‌ల్లాను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాం. శ్రీరామ్ ఆదిత్య‌గారు డైరెక్ట్ చేసిన గ‌త రెండు చిత్రాలు చూశాను. చాలా బావున్నాయి. న‌చ్చాయి. ఇది కూడా త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. అశోక్‌కి చిన్న‌ప్ప‌టి నుండే సినిమాలంటే ఇష్టం. మా మావ‌య్య కృష్ణ‌గారి సినిమాల్లో చిన్న‌ప్పుడు యాక్ట్ చేశాడు అశోక్‌. కృష్ణ‌గారే త‌న ఫ‌స్ట్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు. అలాగే నాని సినిమాలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో యాక్ట్ చేశాడు. అశోక్ 7వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు సింగ‌పూర్‌లో చ‌దివాడు. ఆ స‌మ‌యంలో త‌ను డ్రామా అనే స‌బ్జెక్ట్‌ను ఎంచుకుని నేర్చుకున్నాడు. డిగ్రీని కూడా టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్‌లోనే చేశాడు. త‌ర్వాత రెండు, మూడు ఏళ్లు హార్డ్ వ‌ర్క్ చేసి హీరోగా  ఎంట్రీ ఇస్తున్నాడు అన్నారు.
 
నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా మాట్లాడుతూ..అమ‌ర్‌రాజా గ్రూప్ చాలా పెద్ద సంస్థ‌. మేం మొద‌లు పెట్టిన అన్ని సంస్థ‌లు గొప్ప‌గా స‌క్సెస్ అయ్యాయి. ఇప్పుడు అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌ను మొద‌లు పెట్టాం. ఈ వెంచ‌ర్ కూడా మిగ‌తా వాటిలా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం. అశోక్ చిన్న‌ప్ప‌టి నుండి హీరో కావాల‌ని ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. యంగ్ కంటెంట్‌. శ్రీరామ్ ఆదిత్య‌గారు డైరెక్ట‌ర్‌గా కుద‌ర‌డం హ్యాపీ. నిధి హీరోయిన్‌గా న‌టించ‌డం హ్యాపీగా ఉంది. మంచి టీమ్ కుదిరింది. త‌ను పెద్ద యాక్ట‌ర్ కావాల‌ని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అన్నారు.
 
నిధి అగ‌ర్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌డం ల‌క్కీ భావిస్తున్నాను. కొత్త క‌థ‌, ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది, ఇది అందరికి నచ్చే సినిమా అవుతుంది, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. హీరో అశోక్ గల్లాతో నేను ట్రావెల్ అవుతూ వస్తున్నాను. మంచి ఎనర్జిటిక్ ఉన్న ఆర్టిస్ అవుతాడు, ఈ కథకు తాను కరెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు. ఆడియన్స్‌కు అశోక్ గల్లా తన నటనతో సర్ప్రైజ్ ఇస్తాడు. నిర్మాత ప‌ద్మాగారిని క‌లిశాను. ఆవిడ డ్రీమే ఈ సినిమా. ఈ సినిమా స్టార్ట్ కావాల‌ని ఆవిడ చాలా బ‌లంగా కోరుకున్నారు. యంగ్ టీం, యంగ్ స‌బ్జెక్ట్‌తో వ‌స్తున్నాం, అందరిని ఎంటర్టైన్ చెయ్యబోతున్నాం అన్నారు.

హీరో అశోక్ గ‌ల్లా మాట్లాడుతూ..శ్రీరామ్ ఆదిత్య‌పై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాను. తను నాకు మంచి సినిమా ఇస్తాడని పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. రేప‌టి నుండి షూటింగ్ ప్రారంభం కానుంది, నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటపాటల నడుమ వేడుకగా నటి అర్చన సంగీత్