Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాష రాకుండా పాత్రకు ఏం న్యాయం చేయలేను.. అందుకే తెలుగులో నటించను : అరవింద్ స్వామి

ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా

Advertiesment
భాష రాకుండా పాత్రకు ఏం న్యాయం చేయలేను.. అందుకే తెలుగులో నటించను : అరవింద్ స్వామి
, సోమవారం, 19 డిశెంబరు 2016 (15:39 IST)
ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా అరవింద్ స్వామి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో అతనికి టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి ఓ సంచలన ప్రకటన చేశాడు.  
 
ఇదే విషయంపై ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇకపై తెలుగులో సినిమాలు చేయనని, లాంగ్వేజ్ రాకుండా ఓ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేనని తేల్చి చెప్పాడు. "తనీ ఒరువన్"లో చేసిన క్యారెక్టర్ కాబట్టే ధృవలో నటించానని ప్రెజెంట్ తమిళ్‌లో నటుడిగా చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానని, ఆ సినిమాకు కథ కూడా రాస్తున్నట్టు చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి వంటి సినిమాలో పనిచేసేందుకు అవసరమనుకుంటే ప్రాణాలైనా ఇస్తా: తమన్నా