Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertiesment
Anushka Shetty - Ghati

దేవీ

, బుధవారం, 6 ఆగస్టు 2025 (18:59 IST)
Anushka Shetty - Ghati
యాక్షన్ డ్రామా ఘాటీ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలకు కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ థియేట్రికల్ ట్రైలర్ ద్వారా రిలీజ్ డేట్ ని రివిల్ చేశారు. ఈ చిత్రంలో క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్ నటిస్తుండగా, విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
బ్రిటిష్ రాజ్ కాలంలో ప్రమాదకరమైన కనుమలలో చారిత్రాత్మకంగా రోడ్లు నిర్మించిన  ఘాటి సమాజ ప్రపంచాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు, వారు కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయారు.
 
ఈ కఠినమైన పరిస్థితులు చిక్కుకున్న ప్రేమికుల జంటగా అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు కనిపించారు. అనుష్క పాత్ర అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తప్పు చేస్తున్నామనే గ్రహించి, ఈ చెడు వ్యవస్థకి ఎదురు నిలవడానికి రెడీ అవుతుంది. తన వాళ్లని ఈ ప్రమాదకర వ్యాపారం నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. 
 
ట్రైలర్ లో అనుష్కను మునుపెప్పుడూ చూడని వైల్డ్ అవాతర్ లో కనిపించారు. ఒక బలహీన మహిళ నుంచి క్రిమినల్‌, అక్కడి నుంచి లెజెండ్‌గా మారే ఆమె పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పాత్రకి ప్రాణం పోస్తుంది. విక్రమ్ ప్రభు  పర్ఫార్మెన్స్‌ స్ట్రాంగ్ గా వుంది . చైతన్య రావు, రవీంద్రన్ విజయ్ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. జగపతి బాబు ప్రజెన్స్ మరింత క్యురియాసిటీ పెంచింది.  
 
దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఒక ప్రత్యేకమైన, బోల్డ్ కథను తెరపైకి తెచ్చారు. ఎమోషన్, యాక్షన్ తో కథ అద్భుతంగా నడిపించారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి కటసాని తీసిన విజువల్స్ చూస్తే... ఆ ఘాట్లు మన ముందుకొచ్చినట్టు ఫీలింగ్ కలుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ నాగవెల్లి విద్యాసాగర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. 
 
UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్స్ వండర్ ఫుల్. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ఎడిటర్స్ చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్. స్వామి ఇంటెన్స్ అండ్ షార్ఫ్ గా కట్ చేశారు. యాక్షన్ మాస్టర్ రామ్ కృష్ణ ప్లాన్ చేసిన ఫైట్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. 
 
గ్రిప్పింగ్ కథనం, అద్భుతమైన పర్ఫార్మెన్సులు, టాప్ టెక్నికల్ వాల్యూస్ తో ఘాటి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో పవర్ ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టబోతుంది.  
 తారాగణం: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్