Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నీళ్లు పెట్టుకున్న సుమ కనకాల.. ఆమె చెప్పిన మాటలకి..?

Advertiesment
Suma Kanakala
, శనివారం, 11 నవంబరు 2023 (22:34 IST)
Suma Kanakala
టాలీవుడ్ స్టార్ యాంకర్ ఎవరంటే అందరూ సుమ అంటూ టక్కున చెప్పేస్తారు. ఎలాంటి ప్రోగ్రామ్స్ అయిన తనదైన చెలాకీ తనంతో మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సుమ కనకాల. తెలుగమ్మాయి కాకపోయినా కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతూ మంచి ఫ్యాన్ బేస్ ను కొంతం చేసుకుంది. 
 
తాజాగా సుమ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకుంది. ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో సుమ పాల్గొంది. ఈ ఈవెంట్‌కు సుమ కనకాల, ఒకప్పటి యాంకర్ శిల్ప చక్రవర్తి కూడా హాజరయ్యారు. 
 
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సుమ గురించి ఓ విషయం చెప్పింది శిల్ప. కొన్ని సార్లు మెట్ల మీదే పడుకునేది అని తెలిపింది. కొన్ని సార్లు షూటింగ్స్ చాలా ఆలస్యం అయ్యేవి. ఇంటికొచ్చే సరికి చాలా సమయం అయ్యేది. ఎంత కొట్టిన ఇంటి తలుపులు తీయకపోతే అక్కడ మెట్ల మీదనే పడుకునేది సుమ. 
 
తాను చాలా సార్లు సుమను అలా చూశాను అని తెలిపింది శిల్ప. దాంతో ఆ విషయాలను గుర్తు చేసుకున్న సుమ కన్నీళ్లు పెట్టుకుంది. అదే ఈ ఈవెంట్‌కు సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన సుమ కొడుకు స్టేజ్ పైకి వచ్చిన ఆమెను హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రమోహన్ క్రమశిక్షణ ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలి.. ప్రముఖుల నివాళి